AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramappa Temple: తెలంగాణ ప్రజలకు అభినందనలు.. రామప్పకు అరుదైన గౌరవంపై ప్రధాని మోడీ ట్వీట్

రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా

Ramappa Temple: తెలంగాణ ప్రజలకు అభినందనలు.. రామప్పకు అరుదైన గౌరవంపై ప్రధాని మోడీ ట్వీట్
Pm Modi Ramappa Temple
Sanjay Kasula
|

Updated on: Jul 26, 2021 | 10:21 AM

Share

తెలుగోడి కీర్తిప్రతీక.. ఏళ్లనాటి చరిత్రకు విశ్వఖ్యాతి.. రామప్పకు అరుదైన గౌరవం దక్కింది. ఆ చారిత్రక నిర్మాణం విశ్వ సంపదగా గుర్తింపు పొందింది. యునెస్కో గుర్తింపు కోసం భారతదేశం నుండి రెండు, ప్రపంచ వ్యాప్తంగా 255 ప్రతిపాదనలు వెళ్లగా రామప్పకు ఆ ఘనకీర్తి లభించింది. తెలుగు రాష్ట్రాల్లో యునెస్కో గుర్తింపుపొందిన ఏకైక నిర్మాణంగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోనే యునెస్కో గుర్తింపు సాధించిన ఏకైక ఘనత రామప్ప దేవాలయానికి దక్కింది. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక దేవాలయానికి ఎట్టకేలకు ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. ఇంజనీరింగ్‌, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ఇక మీదట ప్రపంచస్థాయి కట్టడమని సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు. చైనాలో జరిగిన యూనెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కట్టబెట్టింది.

2020 ఏడాదికి గాను రామప్పకు ఈ హోదా దక్కింది. 2021 ఏడాది నామినీగా గుజరాత్‌కి చెందిన ధోలవీర ఆలయం వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ బరిలో ఉంది. యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1,121 కట్టడాలు పోటీ పడ్డాయి. రామప్పకు వారసత్వ సంపద హోదా రాకుండా నార్వే అడ్డుకునే యత్నం చేయగా.. భారత్‌ తరఫున రష్యా వాదించింది. రష్యాతోపాటు 17 దేశాలు ఆమోదం తెలపడంతో రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

ప్రధాని అభినందనలు..

రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా వైభవానికి రామప్ప ఆలయం ప్రతీక అని ప్రధాని చెప్పారు. అలాగే ఈ ఆలయాన్ని పర్యటకులు సందర్శించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తన ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

ఇక రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు ఇవ్వడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆనందం వ్యక్తం చేశారు. యునెస్కోతో పాటు అందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో యునెస్కో గుర్తింపు పొందిన తొలి ప్రదేశం రామప్ప ఆలయం అని తెలిపారు.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇవాళ్టి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Miracle Bore Water: ఆ బోరు వాటర్ తాగితే కీళ్ల నొప్పులు మాయం.. ఆ నీటి కోసం క్యూ కడుతున్న జనం..