Cocaine Smuggling: హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన కొకైన్‌.. శంషాబాద్ విమానాశ్రయంలో రూ.80 కోట్ల విలువైన డ్రగ్స్..

హైదరాబాద్‌‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు రూ.80 కోట్ల విలువైన 8 కిలోల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. టాంజానియా..

Cocaine Smuggling: హైదరాబాద్‌లో భారీగా పట్టుబడిన కొకైన్‌.. శంషాబాద్ విమానాశ్రయంలో రూ.80 కోట్ల విలువైన డ్రగ్స్..
Cocaine
Follow us

|

Updated on: May 02, 2022 | 9:25 PM

హైదరాబాద్‌‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి.  శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాదాపు రూ.80 కోట్ల విలువైన 8 కిలోల కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాంజానియా, కేప్‌టౌన్‌ నుంచి వచ్చిన ఇద్దరి నుంచి చెరో 4 కిలోల చొప్పున కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. కొకైన్‌ తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తి అరెస్టు అయ్యారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, డ్రగ్స్‌పై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సమాచారం ప్రకారం.. DRI, ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులు కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. మే 1వ తేదీ రాత్రి హైదరాబాద్ విమానాశ్రయంలో రెండు వేర్వేరు స్లాట్‌లలో కొకైన్‌ను స్మగ్లింగ్ చేయబోతున్నట్లు డీఆర్‌ఐకి నిఘా సమాచారం వచ్చినట్లుగా తెలిపారు.

దేశంలోని అన్ని ప్రాంతాల్లో అక్రమంగా సరఫరా అవుతున్న డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు DRI అధికారులు. అయితే ఇప్పటికీ డ్రగ్స్ సరఫరా మాత్రం బ్రేక్ పడటం లేదు. డ్రగ్స్ సరఫరాదారులపై అధికారులు నిత్యం నిఘా ఉంచడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.

గతంలో ఏప్రిల్ 28న, DRI, ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ చర్యలు చేపట్టాయి. కొకైన్ క్యాప్సూల్‌తో టాంజానియా పౌరుడిని అరెస్టు చేశారు. అతని వద్ద 1157 గ్రాముల బరువున్న 79 క్యాప్సూల్స్ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు 11 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఏప్రిల్ మొదటి వారంలోనే కస్టమ్స్ బృందం మరో పెద్ద మొత్తంలో తెచ్చిన కొకైన్‌తో ప్రయాణికుడిని పట్టుకున్నారు. ఈ ప్రయాణికుడి నుంచి దాదాపు 89 కోట్ల విలువైన కొకైన్‌ను కస్టమ్స్ స్వాధీనం చేసుకుంది.

ఇవి కూడా చదవండి: Watch Video: హైదరాబాద్‌‌లో వింత ఘటన.. అద్దె కోసం వచ్చిన జంట గదిలోకి వెళ్లి ఏం చేశారో తెలిస్తే షాకవుతారు..

KA Paul: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి.. సిరిసిల్ల వెళ్తుండగా అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు..

Imran Khan: సౌదీలో పాక్ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!