90 ఏళ్ల వృద్ధురాలిపై 37 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలిపై 37ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా
Delhi rape case: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. 90 ఏళ్ల వృద్ధురాలిపై 37ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపగా.. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఢిల్లీ చావ్లాలోనా నజాఫ్గంజ్ ప్రాంతంలో ఓ వృద్ధురాలు నివసిస్తోంది. అదే ప్రాంతంలో నివసిస్తోన్న ఒక వ్యక్తి, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో బలవంతంగా బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ ఏడుపులు విని అక్కడకు చేరుకున్న స్థానికులు నిందితుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ ( డీసీడబ్ల్యూ ) చీఫ్ స్వాతి మాలివాల్ మంగళవారం బాధిత వృద్దురాలిని పరామర్శించారు. నిందితుడిపై సెక్షన్ 376, 363 కింద కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై సర్వత్రా ఆవేశం వ్యక్తమవుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
Read More:
ఓటీటీలో పవన్ ‘వకీల్ సాబ్’..!