Crime News: బావిలో పడి తల్లీ బిడ్డల అనుమానాస్పద మృతి..

కడప జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. బావిలో పడి తల్లి, ఇద్దరు కుమారులు ..

Crime News: బావిలో పడి తల్లీ బిడ్డల అనుమానాస్పద మృతి..
Follow us
Basha Shek

|

Updated on: Oct 30, 2021 | 4:59 PM

కడప జిల్లా చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లిలో శనివారం దారుణం చోటుచేసుకుంది. బావిలో పడి తల్లి, ఇద్దరు కుమారులు అనుమానాస్పదంగా మృతి చెందారు. అయితే ఇది హత్యనా? ఆత్మహత్యనా? అనేది మాత్రం తెలియరావడం లేదు. స్థానికుల కథనం మేరకు శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ్రామంలో ఏర్పాటుచేసిన ఓ ఇంకుడు గుంత పూర్తిగా నీటితో నిండిపోయింది. ఇందులోనే పడి తల్లీ బిడ్డలు మృతి చెందారు. బావిలో తేలియాడుతున్న వీరి మృతదేహాలను పశువుల కాపరులు చూసి గ్రామస్తులకు సమాచారం అందించారు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నీటిలో తేలియాడుతున్న ముగ్గురి మృత దేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్ట్‌ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుల సమాచారం తెలుసుకున్న పోలీసులు వీరిని ఎవరైనా చంపి బావిలో వేశారా లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

Also Read:

Crime News: కూతురుపై కన్నేసిన ప్రియుడు.. తట్టుకోలేక ఆ మహిళ వేసిన శిక్షేంటో తెలుసా..?

Prostitution: ఇల్లు అద్దెకు తీసుకున్నారు.. ఆ తర్వాత మొదలు పెట్టేశారు.. చివరికి పోలీసులకు చిక్కారు..

Mirzapur: విద్యార్థి పట్ల ప్రిన్సిపల్‌ అమానుషం..అల్లరి చేశాడని బిల్డింగ్‌పై నుంచి వేలాడదీశాడు..