Crime News: కూతురుపై కన్నేసిన ప్రియుడు.. తట్టుకోలేక ఆ మహిళ వేసిన శిక్షేంటో తెలుసా..?

Woman sets ablaze live-in partner: భర్త చనిపోవడంతో.. ఆమె వేరే వ్యక్తికి దగ్గరైంది. అతడిని నమ్మి రెండేళ్ల నుంచి సహజీవనం చేసింది. కానీ అతను.. ఆమె 14ఏళ్ల కూతురిపై కన్నేశాడు. ఇది తెలుసుకోని ఆమె

Crime News: కూతురుపై కన్నేసిన ప్రియుడు.. తట్టుకోలేక ఆ మహిళ వేసిన శిక్షేంటో తెలుసా..?
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 30, 2021 | 12:57 PM

Woman sets ablaze live-in partner: భర్త చనిపోవడంతో.. ఆమె వేరే వ్యక్తికి దగ్గరైంది. అతడిని నమ్మి రెండేళ్ల నుంచి సహజీవనం చేసింది. కానీ అతను.. ఆమె 14ఏళ్ల కూతురిపై కన్నేశాడు. ఇది తెలుసుకోని ఆమె అతని హత్యకు ప్లాన్ రచించింది. చివరకు నిద్ర మాత్రలిచ్చి.. ప్రియుడిని పెట్రోల్ పోసి దారుణంగా చంపింది. ఈ షాకింగ్ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్‌లో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలోని ఫరీదాబాద్‌లో 12 రోజుల క్రితం ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహం నైజీరియన్ వ్యక్తిదిగా పోలీసులు అనుమానించారు. అయితే.. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. హత్యకు గురైన వ్యక్తి హర్యానా బల్లభ్‌గఢ్ వాసి అని పోలీసులు తెలిపారు. మృతుడు పవన్‌గా గుర్తించారు. రెండేళ్లుగా ఓ వివాహితతో సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. వాగ్వాదం అనంతరం ఆ మహిళ పవన్‌పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిందని పోలీసులు తెలిపారు. అయితే.. మహిళను అరెస్టు చేసి విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ఓ మహిళ ఫరీదాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. వారిద్దరూ పంజాబ్‌లో నివసిస్తున్నారు. మహిళ భర్త 2019లో క్యాన్సర్‌తో మరణించగా.. ఆ తర్వాత అతని స్థానంలో కంపెనీ ఆమెకు ఉద్యోగం వచ్చింది. పవన్ కూడా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం కాస్త.. ప్రేమగా మారింది. ఇద్దరూ రెండేళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో మహిళ పెద్ద కుమార్తె (14) తన తల్లితో నివసించేందుకు పంజాబ్ నుంచి బల్లాబ్‌ఘర్‌కు వచ్చింది. ఈ క్రమంలో పవన్ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య.. గొడవ జరిగింది. ఈ క్రమంలో పవన్‌ను హత్య చేయాలని ప్లాన్ రచించింది.

ఈ క్రమంలో మహిళ.. అక్టోబరు 16న పవన్‌ను కారులో ఢిల్లీ తీసుకెళ్లింది. అక్కడ తనకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి కారును ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. అతడిని చంపెందుకు మహిళ 15 రోజుల క్రితం బల్లభ్‌గఢ్‌ నుంచి 2 లీటర్ల పెట్రోల్‌, నిద్రమాత్రలు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో నా కోసం ఏదైనా చేస్తావా..? అంటూ పవన్‌ను మహిళ రెచ్చగొట్టింది. అయితే.. నిద్ర మాత్రలు వేసుకోవాలని పవన్ కు చెప్పింది. దీంతో పవన్ మాత్రలు మింగి స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం మహిళ పవన్‌ను ఫరీదాబాద్‌కు తీసుకెళ్లింది. ఆతర్వాత సెక్టార్-75లోని నిర్మానుశ్య ప్రాంతంలో పవన్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read

Crime News: భర్తకు వీడియో కాల్ చేసి భార్య అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లడం లేదని ఏం చేసిందంటే..?

Prostitution: ఇల్లు అద్దెకు తీసుకున్నారు.. ఆ తర్వాత మొదలు పెట్టేశారు.. చివరికి పోలీసులకు చిక్కారు..