WhatsApp Honey Trap: కవ్విస్తారు.. అలా కనిపిస్తారు. మిమ్మల్ని అలాగే కనిపించమంటారు. కక్కుర్తి పడ్డారో ఇక అంతే..
WhatsApp Honey Trap: సమాజంలో మోసాల తీరు రోజురోజుకీ మారుతోంది. మనుషుల బలహీనతలను, ఆశనే పెట్టుబడిగా పెట్టి డబ్బులు కాజేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పేరుతో...
WhatsApp Honey Trap: సమాజంలో మోసాల తీరు రోజురోజుకీ మారుతోంది. మనుషుల బలహీనతలను, ఆశనే పెట్టుబడిగా పెట్టి డబ్బులు కాజేస్తున్నారు. ముఖ్యంగా మహిళల పేరుతో జరుగుతోన్న మోసాలు బాగా ఎక్కువవుతున్నాయి. యువకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాము మోస పోయామనే విషయాన్ని ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందని భావించి ఎవ్వరికీ చెప్పుకోని వారు కొందరరైతే ప్రాణాలు వదిలేస్తున్న వారు మరి కొందరు. డబ్బులు, పరువు రెండూ కోల్పోతూ మానసకింగా కుమిలిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘనటే ఒకటి హైదరాబాద్‌లో జరిగింది. జీడిమెట్లకు చెందిన ఓ యువతి విశాఖకు చెందిన యువకుడిని మోసం చేసి రూ. 24 లక్షలు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు విశాఖ పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు జీడిమెట్లకు చెందిన మహిళతో పాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కుత్బుల్లాపూర్‌లో గతంలో ఓ కాల్ సెంటర్ ఉండేది. అందులో 25 మంది అమ్మాయిలు పనిచేసేవారు. కరోనా కాలంలో కాల్ సెంటర్ మూతపడడంతో.. అదే కాల్ సెంటర్‌కు చెందిన అబ్దుల్ రెమహమాన్ అనే వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన ఆ మహిళలను చేరదీసి అబ్బాయిలను మోసం చేయడం కోసం శిక్షణ ఇచ్చాడు. వారి సహాయంతో అబ్బాయిలను మోసం చేస్తూ రూ. లక్షల్లో డబ్బులు కాజేశాడు. నగరంలో ఇలాంటి ముఠాలు చాలా ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు పోలీసులు.
అబ్బాయిలను ఎలా టార్గెట్ చేస్తారంటే..
మీకు సమీపంలో ఉన్న ఒంటరి మహిళలతో చాటింగ్, ఫోన్ కాల్స్ మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్‌కు ఫోన్ చేయండని ఎస్‌ఎమ్‌ఎస్ వస్తుంది. కాల్ చేయగానే అవతలి వైపు ఓ అమ్మాయి కవ్విస్తూ మాట్లాడుతుంది. తరచూ ఫోన్ చేస్తూ మాటలు కలుపుతుంది. అనంతరం వాట్సాప్‌లో చాటింగ్‌కు ఆహ్వానించి నగ్నంగా ఉండే ఫొటోలను పంపుతారు. అంతటితో ఆగకుండా న్యూడ్ కాల్స్ మాట్లాడుతూ.. అవతలి వ్యక్తిని కూడా బట్టలు విప్పమని రెచ్చగెడుతారు. బాధితులు నగ్నంగా ఉన్న వీడియోను స్క్రీన్ రికార్డింగ్ ద్వారా సేవ్ చేసుకుంటారు. అనంతరం ఆ వీడియోను సదరు వ్యక్తికి పంపించి బ్లాక్‌మెల్ వ్యవహారం ప్రారంభిస్తారు. అడిగినంత డబ్బులు ఇవ్వకుండా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరిస్తూ రూ. లక్షల్లో డబ్బులు కొట్టేస్తారు.
Also Read: Drumstick Leaves Soup: రోగనిరోధక శక్తిని పెంచే మునగాకు సూప్ తయారీ విధానం ఎలా అంటే..
కాబూల్ నగరానికి సమీపంలో తాలిబన్లు.. ఆఫ్ఘన్ లోని అమెరికన్ల తరలింపునకు యూఎస్ విమానాలు సిద్ధం
మాస్కులు తప్పనిసరి ! చైనాలో ప్రజలకు నూతన మార్గదర్శక సూత్రాలు జారీ