కాబూల్ నగరానికి సమీపంలో తాలిబన్లు.. ఆఫ్ఘన్ లోని అమెరికన్ల తరలింపునకు యూఎస్ విమానాలు సిద్ధం
ఆఫ్ఘన్ లో రాజధాని కాబూల్ నగరానికి తాలిబన్లు ఇక సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. దీంతో అమెరికా..ఈ దేశంలోని తమ ప్రజలను, బలగాలను, ఆఫ్ఘన్ ప్రజలను కూడా విమానాల ద్వారా తరలించడానికి సిద్ధపడింది.
ఆఫ్ఘన్ లో రాజధాని కాబూల్ నగరానికి తాలిబన్లు ఇక సుమారు 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. దీంతో అమెరికా..ఈ దేశంలోని తమ ప్రజలను, బలగాలను, ఆఫ్ఘన్ ప్రజలను కూడా విమానాల ద్వారా తరలించడానికి సిద్ధపడింది. అమెరికా నుంచి మొట్టమొదటి విమానం కాబూల్ విమానాశ్రయంలో దిగింది. కాబూల్ నుంచి రోజుకు కొన్ని వేలమందిని తరలిస్తామని పెంటగాన్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ మీడియాకు తెలిపారు. సుమారు 3 వేలమంది అమెరికన్ ట్రూప్స్ కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడం ప్రారంభించారని, క్రమంగా వీరి సంఖ్య పెరగవచ్చునని ఆయన చెప్పారు. ఆ నగరాన్ని ఇతర ప్రాంతాల నుంచి వేరు చేయడానికి తాలిబన్లు యత్నిస్తున్నారని, అయితే దాన్ని పూర్తిగా వశపరచుకునేందుకు వారికి మరికొంత కాలం పట్టవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ఆఫ్ఘన్ లోని తమ ప్రజలను ఖాళీ చేయించాలని కాబూల్ లోని తమ రాయబార, దౌత్య కార్యాలయాలను కోరినట్టు ఆయన చెప్పారు. ఇక బ్రిటన్,జర్మనీ, డెన్మార్క్,స్పెయిన్ దేశాలు కూడా ఆఫ్గనిస్తాన్ లోని తమ దౌత్య కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేయడం ప్రారాంభించాయి. లేదా ఆ దేశంలోని తమ ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కాగా-లోగార్ ప్రావిన్స్ రాజధాని పుల్-ఎ-ఆలమ్ నగరాన్ని తాలిబన్లు తాజాగా ఆక్రమించుకున్నారు.కొన్ని చోట్ల స్థానిక ప్రజలు వీరికి స్వాగతం పలుకుతున్నారు.
హెరాత్ ప్రావిన్స్ లో తమ ఆఫ్ఘన్ దళాలకు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చిన ఇస్మాయిల్ ఖాన్ అనే నాయకుడిని, అతడి మిలీషియా ఫైటర్లను తాలిబన్లు పట్టుకున్నారు. అనేక చోట్ల వీరి పతాకాలు ఎగురుతున్నాయి. సెప్టెంబరు 11 నాటికి ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తి అవుతుందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించడంతో తాలిబన్ల దూకుడుకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. పలు నగరాల్లో ఆఫ్ఘన్ సైనిక దళాలు వారికీ లొంగిపోతున్నాయి. కుందుజ్ విమానాశ్రయాన్ని తాలిబన్లు గతంలోనే తమ హస్తగతం చేసుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: ఫేస్ మాస్క్ పై అమెరికాలోని స్కూల్లో గొడవ.. టీచర్ పై విద్యార్థిని తండ్రి దాడి.. కొత్త నిబంధనలతో చిక్కులు