దొంగోడు..పోలీసు ఎగ్జామ్ రాయడానికి వచ్చి బుక్కయ్యాడు!

దొంగోడు..పోలీసు ఎగ్జామ్ రాయడానికి వచ్చి బుక్కయ్యాడు!

అతడో మస్తు చైన్ స్నాచర్. హస్తవాసితో చాలా గొలుసులను కొల్లగొట్టుకుపోయాడు. పోలీసులకు గట్టి సవాళ్లనే విసిరాడు. కానీ పోలీసు ఎగ్జామే రాయడానికే వచ్చి బుక్కయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణపురమ్​లో కొంతకాలం క్రితం గొలుసు దొంగతనానికి పాల్పడ్డాడు విజయకాంత్​. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు. కానీ నిందితుడి ఆచూకి మాత్రం దొరకలేదు. కట్ చేస్తే మధురై జిల్లాలో మెల్లుర్​లోని ఓ ప్రైవేటు కళాశాలలో​ ఆదివారం పోలీసు ట్రైనీ […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Aug 27, 2019 | 6:29 PM

అతడో మస్తు చైన్ స్నాచర్. హస్తవాసితో చాలా గొలుసులను కొల్లగొట్టుకుపోయాడు. పోలీసులకు గట్టి సవాళ్లనే విసిరాడు. కానీ పోలీసు ఎగ్జామే రాయడానికే వచ్చి బుక్కయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణపురమ్​లో కొంతకాలం క్రితం గొలుసు దొంగతనానికి పాల్పడ్డాడు విజయకాంత్​. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు. కానీ నిందితుడి ఆచూకి మాత్రం దొరకలేదు. కట్ చేస్తే మధురై జిల్లాలో మెల్లుర్​లోని ఓ ప్రైవేటు కళాశాలలో​ ఆదివారం పోలీసు ట్రైనీ పోస్టులకు పరీక్ష నిర్వహించారు. విజయకాంత్​ ఆ పరీక్షకు హాజరయ్యాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకున్నారు. పరీక్ష రాసి బయటకు వచ్చిన విజయకాంత్​ను అరెస్టు చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu