Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Academy Scam: తెలుగు అకాడమిలో ఇంటిదొంగలు.. నిగ్గుతేల్చే పనిలో సీసీఎస్ పోలీసులు..

తెలుగు అకాడమీలో అవినీతి అందర్నీ షాక్‌కు గురిచేసింది. అసలు ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల అక్రమాలేంటి? ఆ దొంగలెవరు? అనే అంశంపై విద్యాశాఖ ఫిర్యాదుతో నిగ్గుతేల్చేపనిలో పడింది పోలీస్ శాఖ.

Telugu Academy Scam: తెలుగు అకాడమిలో ఇంటిదొంగలు.. నిగ్గుతేల్చే పనిలో సీసీఎస్ పోలీసులు..
Telugu Academy
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 01, 2021 | 9:13 AM

తెలుగు అకాడమి స్కాంలో దర్యాప్తు వేగవంతమైంది. ఇంటిదొంగల పనేనని ప్రాథమికంగా నిర్దారించారు సీసీఎస్ పోలీసులు. బ్యాంకు అధికారులతో చేతులు కలిపి నిధులు కాజేసినట్టు గుర్తించారు. ఇప్పటివరకు రూ. 71 కోట్లు దారి మల్లించి కాజేసిన నిందితులు.. ఈ కుంభకోణానికి సంబంధించి మూడు కంప్లైంట్స్‌ ఇచ్చారు తెలుగు అకాడమీ డైరెక్టర్ సోమిరెడ్డి. ఈ ఫిర్యాదులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మాయమైన నిధులు ఎక్కడికి తరలించారు? అన్న అంశంపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. నిధుల గోల్ మాల్‌లో అకాడమీ, బ్యాంక్ అధికారుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల నిర్దారణకు వచ్చారు. అకాడమీలోని ముగ్గురు ఉద్యోగుల పాత్రపై ఆరా తీస్తున్నారు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బిఎల్, అగ్రసేన్ బ్యాంక్ ప్రతినిధులను గురువారం విచారించిన పోలీసులు..శుక్రవారం మరోసారి బ్యాంక్ అధికారులను అకాడమీ ఉద్యోగులను ప్రశ్నించనున్నారు.

తెలుగు అకాడమీకి సంబంధించిన ఫిక్స్ డ్ డిపాజిట్ల అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన శాఖాపరమైన కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనర్‌ ఒమర్‌ జలీల్‌, అకౌంట్స్ ఆఫీసర్ రాంబాబు, జాయింట్ డైరెక్టర్, కమిషనర్ కాలేజీ ఎడ్యుకేషన్ యాదగిరి సభ్యులుగా ఉన్నారు. అక్టోబర్ 2లోగా ఈ కమిటీ విచారణ జరిపి ప్రాథమిక నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది ప్రభుత్వం. హిమాయత్‌నగర్‌లో తెలుగు అకాడమీ దశాబ్దాలుగా కార్యలపాలు నిర్వహిస్తుంది.

ఉమ్మడి ఆస్తుల జాబితాలో ఉన్న తెలుగు అకాడమీ నిధులను ఆంధ్రప్రదేశ్‌కు పంచాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తెలుగు అకాడమీలో ఉన్న రూ. 213 కోట్ల రూపాయల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాటా రూ. 125 కోట్లు ఇవ్వడానికి అకాడమీ సిద్ధం అయ్యింది.

భవనాలు, నగదు వివరాలను లెక్కిస్తుండగా.. వివిధ బ్యాంక్‌లతోపాటు యూబీఐ కార్వాన్‌, సంతోష్‌నగర్‌ శాఖల్లో రూ. 43 కోట్ల రూపాయల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉన్నాయని తేలింది. వీటిని గడువు తీరకముందే తీసుకోవాలని అకాడమీ అధికారులు నిర్ణయించారు. అయితే రూ. 43 కోట్ల రూపాయలు విత్‌డ్రా చేసేందకు ప్రయత్నించగా ఆసలు బ్యాంక్‌లో డబ్బులు లేవని తేలింది.

సెప్టెంబరు 22న డబ్బులు కోసం తెలుగు అకాడమీ అధికారులు బ్యాంక్‌కు వెళ్లగా.. తర్వలో ఇస్తామని అధికారులు చెప్పారు. మళ్ళీ అడగ్గా ఆసలు నిధులు లేవని బ్యాంక్ మేనేజర్ మస్తాన్ అలీ పేర్కొన్నారు. దీంతో అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం లావాదేవిలో బ్యాంక్ మేనేజర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ. 43 కోట్లలో రూ. 23 కోట్లు వేరే బ్యాంక్‌కు బదిలీ అయినట్టు తెలుస్తోంది. ఎవరు ఈ స్కామ్‌కి పాల్పడ్డారో తేల్చేపనిలో పడ్డారు అధికారులు.

ఇవి కూడా చదవండి:  SBI Car Loan: కారు కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. జీరో ప్రాసెసింగ్ ఛార్జ్.. ఇంట్లో కూర్చుని తీసుకోండి..

TS RTC: సాహో సజ్జనార్.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీనే జీతాలు..