Kadapa Road Accident: రెండు ప్రమాదాలకు కారణమైన గేదె.. ఒకరు మృతి.. అసలేమైందంటే?
Kadapa Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గేగె రెండు ప్రమాదాలకు కారణమైంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని

Kadapa Road Accident: ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గేగె రెండు ప్రమాదాలకు కారణమైంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని వేంపల్లె పట్టణ సమీపంలోని సంచుల ఫ్యాక్టరీ వద్ద చోటుచేసుకుంది. ఆటో ఈరోడ్డులో వెళుతున్న క్రమంలో.. గేదె ఆకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. దీంతో ఆటో గేదెను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణం చేస్తున్న చెర్లోపల్లెకు చెందిన వెంకట రాంరెడ్డి మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అనంతరం గాయాలపాలైన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కాగా.. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే అదే గేదెను ఢీకొని..బైక్ పై వెళుతున్న వారు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మహిళతోపాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వేంపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Also Read:
