రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ టోపీ.. ఈ మోసానికి పాల్పడింది ఓ మాజీమంత్రి బంధువు..
రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది. ఈ మోసానికి పాల్పడింది ఎవరో కాదు. ఓ మాజీమంత్రి అన్న కొడుకు. ఎవరా మాజీమంత్రి? ఏంటా కథ. కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా, ఆ పార్టీ నేతల
Ponnala Bhaskar: రైల్వే ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగింది. ఈ మోసానికి పాల్పడింది ఎవరో కాదు. ఓ మాజీమంత్రి అన్న కొడుకు. ఎవరా మాజీమంత్రి? ఏంటా కథ. కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా, ఆ పార్టీ నేతల పేరు చెప్పి భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. తాజాగా రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు ఓ వైట్ కాలర్ బంధువు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, డబ్బులు తీసుకుని మోసం చేశాడు. 16 మంది దగ్గర ఉద్యోగాలు వస్తాయని డబ్బు వసూలు చేసి, ఉద్యోగాలు ఇప్పించలేదు. దీంతో రాచకొండ సీపీని ఆశ్రయించారు బాధితులు. ఈ తతంగంలో కీలక నిందితుడు మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య సమీప బంధువే కావడం గమనార్హం.
పొన్నాల భాస్కర్, కొందరితో కలిసి ఇలా మోసాలకు పాల్పడుతున్నారు. అపాయింట్‌మెంట్ లెటర్స్, ఐడి కార్డులను కూడా ఇచ్చారు భాస్కర్. కానీ సంవత్సరం గడుస్తున్నా ఉద్యోగాలు ఇవ్వకుండా తిప్పడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. డబ్బులు ఇస్తానని నిరుద్యోగులను ముంబై తీసుకెళ్లిన భాస్కర్, గ్యాంగ్‌తో బెదిరింపులకు పాల్పడ్డారు.
పొన్నాల లక్ష్మయ్య రిలేటివ్ అవుతాడని, పోలీసులు ఏమి చేయలేరని బెదిరిస్తున్నట్టు వెల్లడించారు బాధితులు. న్యాయం చేయకుంటే ఆత్మహత్యలే గతి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Omicron Test Kit: ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించేందుకు సరికొత్త కిట్.. తయారు చేసిన ఐసీఎంఆర్