Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Story: మొహం చాటేసిన ప్రియుడు.. మౌనపోరాటానికి దిగిన యువతి.. ఎక్కడంటే..?

Girl frient silent fight infront of lover house: భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఓ యువతి ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తనను మోసం చేశాడని అబ్బాయి ఇంటి ముందు మౌనపోరాటానికి

Love Story: మొహం చాటేసిన ప్రియుడు.. మౌనపోరాటానికి దిగిన యువతి.. ఎక్కడంటే..?
Yellandu News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 21, 2021 | 9:21 AM

Girl frient silent fight infront of lover house: భద్రాద్రి జిల్లా ఇల్లందులో ఓ యువతి ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు తనను మోసం చేశాడని అబ్బాయి ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది. ఐతే ఇంటికి తాళాలు వేసుకొని వెళ్లిపోయారు అబ్బాయి తల్లిదండ్రులు. గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఆ ఇద్దరూ. వారి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. ఈ నెల 19న మ్యారేజ్‌ జరగాల్సి ఉంది. అబ్బాయి తల్లిదంద్రులకు కట్నం కింద కొంత నగదు కూడా ఇచ్చారు యువతి తల్లిదండ్రులు. కానీ మరుసటి రోజు నుంచే ఫోన్‌ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకుని తిరుగుతున్నాడు శ్యామ్. దీంతో తనకు న్యాయం చేయాలంటూ మౌనదీక్షకు దిగింది ఆ యువతి. ఆమెకు స్థానికులు కూడా మద్దతు తెలిపారు.

కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పెళ్లి తేదీ ఖరారు చేసుకొని ప్రయుడు తప్పించుకోని తరగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

TS Road Accident: పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా దంపతుల దుర్మరణం..

Immunity Booster: శీతాకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్‌లో ఈ 5 ఆహార పదార్థాలు ఉండాల్సిందే..!