AP Crime News: అనుమానంతో భార్యపై దాడి.. ఆమె మరణవార్త తెలుసుకొని భర్త ఏం చేశాడంటే..?
Guntur Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రులో భర్త.. భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె చికిత్స

Guntur Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పొన్నూరు మండలం పచ్చల తాడిపర్రులో భర్త.. భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ వార్త తెలుసుకున్న భర్త.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందిన యేసుబాబు భార్యను తరచూ అనుమానంతో వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో దక్కుమల్ల యేసు బాబు భార్య మనీషాపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మనీషాను కుటుంబసభ్యులు పొన్నూరు ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఆమె వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
ఈ క్రమంలో భార్య మరణ వార్త విన్న ఏసుబాబు.. ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పొన్నూరు పోలీసులు తెలిపారు.
Also Read:




