సికింద్రాబాద్‌లో విషాదం..
సికింద్రాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. సీతాఫల్ మండిలోని ఓ పురాతన భవనం కుప్పకూలిపోయింది .ఈ ఘటనలో 14 నెలల బాలుడు మృతి చెందగా.. చిన్నారి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. కుప్పకూలిన సదరు భవనంలో గత కొతంకాలంగా స్వాతి దంపతులు నివాసముంటున్నారు. అయితే ఇవాళ ఉదయం ఇంట్లో పడుకున్న సమయంలో ఇంటిపై కప్పు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో వాళ్ల కుమారుడికి తీవ్రగాయాలపాలై.. అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని తీవ్రగాయాలపాలైన స్వాతిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.