తలతో పోలీస్ స్టేషన్‌కు, నల్గొండలో దారుణం
నల్గొండ: నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం ఓ యువకుడు (28) దారుణహత్యకు గురైన ఘటన నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఎండీ ఇర్ఫాన్, నాంపల్లి మండల కేంద్రానికి చెందిన ఎండీ గౌస్‌కు సోదరి వరుసైన ఓ మహిళ ఉండేది. ఆ మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ తర్వాత నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన సద్దాం […]

నల్గొండ: నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం ఓ యువకుడు (28) దారుణహత్యకు గురైన ఘటన నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఎండీ ఇర్ఫాన్, నాంపల్లి మండల కేంద్రానికి చెందిన ఎండీ గౌస్‌కు సోదరి వరుసైన ఓ మహిళ ఉండేది. ఆ మహిళ భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. ఆ తర్వాత నాంపల్లి మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన సద్దాం అనే ఆటో డ్రైవర్ ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లాడు. కొంతకాలం ఇద్దరూ సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే మహిళ 2017లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో తమకు సోదరి వరుసైన మహిళను సద్దాం హత్య చేశాడనే నెపంతో అతనిపై ఇర్ఫాన్, గౌస్‌లు కోపం పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం నాంపల్లిలోని ఎస్సీ కాలనీలో కొబ్బరి బొండాల కత్తితో ఇర్ఫాన్, గౌస్ ఇద్దరూ సద్దాం తల నరికారు. ఆ తలతో పాటు నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. తలతో వచ్చిన వారిని చూసి ఆశ్చర్యానికి గురైన పోలీసులు వారు చెప్పింది విన్నాక ఘటనా స్థలికి వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న సద్దాం డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం దేవరకొండ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.





