నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఘోరం

ఓ యువకుడ్ని మరో ఇద్దరు యువకులు తల నరికి చంపారు. అనంతరం తెగిపడ్డ తలను సంచిలో తీసుకువెళ్లి స్ధానిక పోలీస్‌స్టేషన్‌‌లో లొంగిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే నాంపల్లి మండలం నేరేళ్లపల్లికి చెందిన సద్దాం అనే ఆటో డ్రైవర్ .. భర్త మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్న ఓ యువతికి దగ్గరయ్యాడు. వీరిద్దరూ కొంతకాలం హైదరాబాద్‌లో సహజీవనం కూడా సాగించారు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. కొంతకాలం తర్వాత […]

నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే ఘోరం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 21, 2019 | 1:23 AM

ఓ యువకుడ్ని మరో ఇద్దరు యువకులు తల నరికి చంపారు. అనంతరం తెగిపడ్డ తలను సంచిలో తీసుకువెళ్లి స్ధానిక పోలీస్‌స్టేషన్‌‌లో లొంగిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే నాంపల్లి మండలం నేరేళ్లపల్లికి చెందిన సద్దాం అనే ఆటో డ్రైవర్ .. భర్త మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్న ఓ యువతికి దగ్గరయ్యాడు. వీరిద్దరూ కొంతకాలం హైదరాబాద్‌లో సహజీవనం కూడా సాగించారు. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. కొంతకాలం తర్వాత ఆమె 2017లో ఆత్మహత్యకు పాల్పడింది.

దీంతో ఆమెకు వరుసకు సోదరులయ్యే నల్గొండ జిల్లా అనుముల మండలం మారెపల్లి గ్రామానికి చెందిన ఎండీ ఇర్ఫాన్‌, నాంపల్లి మండల కేంద్రానికి చెందిన ఎండీ గౌస్‌ ఇద్దరూ కలిసి సద్దాంపై పగ పెంచుకుని శనివారం రాత్రి దారుణంగా తల నరికి చంపారు. యువకుడ్ని దారుణంగా చంపిన తర్వాత ఇద్దరూ ఒక సంచిలో తలను నేరుగా పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.