వస్తే తరిమి కొట్టండి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీ అధికారులు పోడు భూముల్లోకి వస్తే వారిని తరిమి కొట్టాలన్నారు. ఉట్నూర్‌ మండలం మత్తడిగూడలో శనివారం జరిగిన గిరిజన నాయకుడు సిడాం శంబు మొదటి వర్థంతి సభలో ఎంపీ బాపూరావు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. హరితహారం పేరుతో మా భూముల్లోకి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, అలా ఎవరైన గిరిజనుల భూముల్లోకి వస్తే వారిపై కర్రలతో దాడి చేయాలని పిలుపునిచ్చారు. అటవీ అధికారులు […]

వస్తే తరిమి కొట్టండి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 21, 2019 | 1:58 AM

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపూరావు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీ అధికారులు పోడు భూముల్లోకి వస్తే వారిని తరిమి కొట్టాలన్నారు. ఉట్నూర్‌ మండలం మత్తడిగూడలో శనివారం జరిగిన గిరిజన నాయకుడు సిడాం శంబు మొదటి వర్థంతి సభలో ఎంపీ బాపూరావు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.

హరితహారం పేరుతో మా భూముల్లోకి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, అలా ఎవరైన గిరిజనుల భూముల్లోకి వస్తే వారిపై కర్రలతో దాడి చేయాలని పిలుపునిచ్చారు. అటవీ అధికారులు గిరిజనుల జీవితాలను ఆగం చేస్తున్నారని,పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయాలని, అంతేగాకుండా పోడు భూముల్లోకి ఎవరైనా అధికారులు వస్తే తరిమి కొట్టాలన్నారు బాపూరావు.

ఇటీవల కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేయడానికి ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి వచ్చిన అధికారులపై సిర్పూరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణ దారుణంగా కర్రలతో దాడిచేశారు. ఈ దాడిలో మహిళా ఈ దాడిలో ఎఫ్‌ఆర్వో అనిత తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఎంపీ సోయం బాపూరావు కూడా అటవీ అధికారుల విషయంలో దాడి చేయాలని పిలుపునివ్వడం కలకలం రేపుతోంది.