టెన్షన్..టెన్షన్..ఎయిర్‌పోర్టులో బాంబ్

మంగుళూరు ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం చెలరేగింది. టికెట్ కౌంటర్ వద్ద ఓ అనుమానస్పద బ్యాగ్ ప్రయాణికులను ఉక్కిరి బిక్కిరి చేసింది. దీంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పోలీసులకు సమాధానం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సదరు బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే ఆ బ్యాగ్‌ను థ్రెట్ కంటైన్మెంట్ వాహనం ద్వారా కెంజార్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. పూర్తిగా పరిశీలించిన అనంతరం అందులో మెటల్ కాయిన్ బాక్స్ ఉందని, లోపల […]

టెన్షన్..టెన్షన్..ఎయిర్‌పోర్టులో బాంబ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 20, 2020 | 6:09 PM

మంగుళూరు ఇంటర్నేషల్ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం చెలరేగింది. టికెట్ కౌంటర్ వద్ద ఓ అనుమానస్పద బ్యాగ్ ప్రయాణికులను ఉక్కిరి బిక్కిరి చేసింది. దీంతో ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పోలీసులకు సమాధానం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న బాంబ్ స్క్వాడ్ సదరు బ్యాగులో ఐఈడీ పేలుడు పదార్థం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. వెంటనే ఆ బ్యాగ్‌ను థ్రెట్ కంటైన్మెంట్ వాహనం ద్వారా కెంజార్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. పూర్తిగా పరిశీలించిన అనంతరం అందులో మెటల్ కాయిన్ బాక్స్ ఉందని, లోపల పేలుడు పదార్థం, లోహపు ముక్కలు ఉన్నాయని గుర్తించారు. వెంటనే దాన్ని నిర్వీర్యం చేశారు. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి..ఎయిర్‌పోర్ట్‌ను తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్‌ ద్వారా అనుమానితుడ్ని గుర్తించారు. అతడు ముఖాన్ని దాచుకుంటూ ఆటోలో వెళ్లినట్టు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.