బర్త్ డే కేక్ కట్ చేసి..చిక్కుల్లో పడ్డ సినీ హీరో..!
బర్త్ డే రోజు కేక్ కట్ చెయ్యడం కూడా తప్పా.. అవును తప్పే కేక్ కట్ చెయ్యడానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అంటున్నారు కొందరు నెటిజన్లు. అందుకు విరుద్దంగా ప్రవర్తించినందుకుగానూ కన్నడ హీరో దునియా విజయ్‌ను ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హోస్కెరికిహళ్లిలో దునియా విజయ్ తల్వార్‌తో కేక్ కట్ చెయ్యడం తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ ఆదివారం రాత్రి ఆయన తన 47వ బర్త్ డేను బంధుమిత్రుల సమక్షంలో […]
బర్త్ డే రోజు కేక్ కట్ చెయ్యడం కూడా తప్పా.. అవును తప్పే కేక్ కట్ చెయ్యడానికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి అంటున్నారు కొందరు నెటిజన్లు. అందుకు విరుద్దంగా ప్రవర్తించినందుకుగానూ కన్నడ హీరో దునియా విజయ్‌ను ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హోస్కెరికిహళ్లిలో దునియా విజయ్ తల్వార్‌తో కేక్ కట్ చెయ్యడం తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ ఆదివారం రాత్రి ఆయన తన 47వ బర్త్ డేను బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. బర్త్ డే గిఫ్ట్‌గా ఫ్యాన్స్ కోసం తన కొత్త సినిమా ‘సలగ’ టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే కేక్‌ను నార్మల్ నైఫ్‌తో కాకుండా ఓ భారీ ఖడ్గంతో కట్ చేశాడు. ఇదే ఈ శాండిల్‌వుడ్ యాక్టర్‌ను చిక్కుల్లో పడేసింది.
మారణాయుధాలను ఓపెన్ ప్లేసుల్లో ప్రదర్శించడం చట్టరిత్యా నేరం. ఇదే పాయింట్‌ను హైలెట్ చేస్తూ, దునియా విజయ్ టార్గెట్‌గా ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నారు. దీంతో పోలీసులు కూడా సెక్షన్ 283 ప్రకారం విజయ్‌పై యాక్షన్ తీసుకునేందుకు సదరు బర్త్ డే వీడియోను పరిశీలిస్తున్నారు. కత్తి పొడవు ఐదు అంగుళాల కంటే ఎక్కువ ఉంటే..వెపన్స్ యాక్ట్ కింద అతనిపై చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.