AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెక్స్ రాకెట్‌లో మాజీ సీఎం.. చివరికేమైందంటే.?

మధ్యప్రదేశ్‌లో భారీ బ్లాక్ మెయిల్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒక మాములు ఇంజినీర్ ఇచ్చిన కంప్లయింట్‌తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో.. ఈ బాగోతమంతా బయటపడింది. ఇందులో 40 మంది కాల్ గర్ల్స్‌తో పాటు పలువురు బాలీవుడ్ బీ గ్రేడ్ నటీమణులు.. అధికారులు, రాజకీయ నాయకులతో పాటు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ కూడా ఈ స్కాండల్‌లో చిక్కుకుపోవడం గమనార్హం. వీరందరూ మింగలేక కక్కలేక ఏమి చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఈ బ్యూరోక్రాట్లు, […]

సెక్స్ రాకెట్‌లో మాజీ సీఎం.. చివరికేమైందంటే.?
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 25, 2019 | 6:50 PM

Share

మధ్యప్రదేశ్‌లో భారీ బ్లాక్ మెయిల్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఒక మాములు ఇంజినీర్ ఇచ్చిన కంప్లయింట్‌తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో.. ఈ బాగోతమంతా బయటపడింది. ఇందులో 40 మంది కాల్ గర్ల్స్‌తో పాటు పలువురు బాలీవుడ్ బీ గ్రేడ్ నటీమణులు.. అధికారులు, రాజకీయ నాయకులతో పాటు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ కూడా ఈ స్కాండల్‌లో చిక్కుకుపోవడం గమనార్హం.

వీరందరూ మింగలేక కక్కలేక ఏమి చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ఈ బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు ఆ మహిళలతో గడిపిన సమయంలో చిత్రీకరించిన 92 హైకాల్వీటి వీడియో క్లిప్స్ ప్రస్తుతం పోలీస్ అధికారుల చేతికందాయి. అంతేకాకుండా ఈ సెక్స్, బ్లాక్ మెయిలింగ్ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురు మహిళలను కూడా అరెస్ట్ చేసి.. వారి వద్ద ఉన్న రెండు ల్యాప్‌టాప్‌లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇకపోతే మధ్యప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ హానీ ట్రాప్‌లో తమ పార్టీకి చెందిన నాయకులను పడేస్తున్నారని.. ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికారి డి.శ్రీనివాస్‌ను తప్పించి.. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.

కాగా ఈ సెక్స్ రాకెట్‌కు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన శ్వేతా స్వాప్నిల్ జైన్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఇక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… శ్వేతా తాను లక్ష్యంగా చేసుకొన్న ఒక బ్యూరోక్రాట్ లేదా మంత్రిని గెస్ట్ హౌస్ లేదా తాను ఎంపిక చేసుకొన్న ఫైవ్ స్టార్ హోటల్‌కు ఆహ్వానించేది. సదరు టార్గెట్‌ అధికారిక పర్యటనల నిమిత్తం ముంబై, ఢిల్లీకి వెళితే..  వారి డిమాండ్ మేరకు టాప్‌ మోడల్స్, కాల్‌గర్ల్స్‌, బాలీవుడ్ హీరోయిన్లకు ఎరవేసేది. ఇక ఆ ఇద్దరూ శృంగారంలో పాల్గొంటుండగా సీక్రెట్‌గా వీడియోను చిత్రీకరించేవారు. ఆ తర్వాత వాటితో సదరు వ్యక్తులను బ్లాక్‌మెయిల్‌ చేసేవారు. కాగా తన భర్త స్వాప్నిల్ జైన్ నిర్వహిస్తున్న ఓ ఎన్జీవో కోసం నిధులు సేకరించే క్రమంలో పలువురుని హనీట్రాప్‌లోకి లాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె భర్త నుంచి ఐదు హార్డ్ డిస్కులను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఇక విచారణంలో భాగంగా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం తనకు భోపాల్‌లోని ఖరీదైన ప్రాంతమైన మినల్ రెసిడెన్సీలో ఒక బంగ్లా బహుమతిగా ఇచ్చినట్లు శ్వేతా అంగీకరించారు. శ్వేతా జైన్‌తో పాటు, మరో మహిళ ఆర్తీ దయాల్ కూడా ఐఏఎస్ అధికారి నుంచి గిఫ్ట్‌గా భోపాల్‌లో ఒక ఫ్లాట్ పొందానని ధృవీకరించారు.

మరోవైపు ఈ విషయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా స్పందిస్తూ.. ఎన్నో సంవత్సరాలుగా భోపాల్, ఇండోర్ వంటి నగరాల్లో సెక్స్ రాకెట్ సాగుతోందని.. బ్లాక్ మెయిల్‌కు గురైన నాయకుల్లో 80 శాతం బీజేపీకి చెందిన నేతలే ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఈ ఉదంతంలో కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని వెల్లడించారు.