Bangladesh: హిందువులపై కొనసాగుతున్న వరుస దాడులు.. మరో యువకుడిపై దాడి చేసి విషప్రయోగం..!
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు యధేచ్చగా కొనసాగుతున్నాయి. కేవలం రూ. 500 అప్పు చెల్లించలేదన్న కారణంగా జై మహాపాత్ర అనే 21 ఏళ్ల యువకుడిని సునాంగంజ్‌లో హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమీర్ ఉల్ ఇస్లామ్ అనే వ్యక్తి జై మహాపాత్రపై దాడి చేసి విష ప్రయోగం చేసి, కొట్టి చంపేసినట్టు కుటుంబసభ్యులు ఆరోపించారు.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు యధేచ్చగా కొనసాగుతున్నాయి. కేవలం రూ. 500 అప్పు చెల్లించలేదన్న కారణంగా జై మహాపాత్ర అనే 21 ఏళ్ల యువకుడిని సునాంగంజ్‌లో హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అమీర్ ఉల్ ఇస్లామ్ అనే వ్యక్తి జై మహాపాత్రపై దాడి చేసి విష ప్రయోగం చేసి, కొట్టి చంపేసినట్టు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ సంఘటన మైనారిటీల భద్రత గురించి మరోసారి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ముఖ్యంగా వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.
అమర్ ఉల్ ఇస్లామ్ మొబైల్ షాప్‌లో జై మహాపాత్ర ఫోన్ కొన్నాడు. ఫోన్ కోసం రూ.500 బాకీ పడ్డాడు. దుకాణానికి వచ్చిన జై మహాపాత్రపై దాడి చేసి బంధించాడు. దాడిలో జై మహాపాత్రకు తీవ్రగాయాలైనట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. గాయపడ్డ జై మహాపాత్రపై అమీర్ ఉల్ ఇస్లామ్ విష ప్రయోగం చేసి చంపేశాడని ఆరోపించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, అతన్ని సిల్హెట్‌లోని MAG ఉస్మానీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని ICUలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం, ఈ విషయంపై అధికారుల నుండి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. పోలీసు దర్యాప్తు జరుగుతోంది. జై మహాపాత్ర కుటుంబసభ్యులు న్యాయం కావాలని కోరుతున్నారు.
ఇటీవల జరిగిన మరో మరణం తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది. భండార్‌పూర్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల హిందూ యువకుడు మితున్ సర్కార్, ఒక గుంపు నుండి పారిపోతూ మరణించాడు. దొంగతనం చేశాడనే అనుమానంతో తనను వెంబడిస్తున్న గుంపు నుండి తప్పించుకోవడానికి మితున్ కాలువలోకి దూకాడు. తరువాత అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డిసెంబర్ 2025లో విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. దీని తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాలలో హిందువులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. దీపు చంద్ర దాస్, అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్ హత్యలు సమాజంలో తీవ్ర భయాందోళనలను వ్యాప్తి చేశాయి. షరియత్‌పూర్ జిల్లాలో ఒక హిందూ వ్యాపారవేత్తను కొట్టి చంపడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది.
ఈ సంఘటనలను బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి ఒక ప్రకటన తీవ్రంగా ఖండించింది. ఒక డిసెంబర్ నెలలోనే 51 మత హింస సంఘటనలు నమోదయ్యాయి. వీటిలో 10 హత్యలు, 23 దోపిడీలు, దహనం కేసులు, 10 దోపిడీ, దొంగతనం సంఘటనలు, తప్పుడు దైవదూషణ ఆరోపణలపై నాలుగు నిర్బంధ, చిత్రహింస కేసులు, ఒక అత్యాచార యత్న సంఘటన, మూడు భౌతిక దాడి కేసులు ఉన్నాయని బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
