Ladies Safety: ట్రయల్‌ రూం ట్రబుల్స్‌… కెమెరా కళ్లు చూస్తున్నాయి జాగ్రత్త..

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ షాపింగ్‌మాల్‌ ట్రయల్‌ రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా పక్క రూం నుంచి ఇద్దరు యువకులు సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన సంగతి తెలిసిందే..

Ladies Safety:  ట్రయల్‌ రూం ట్రబుల్స్‌... కెమెరా కళ్లు చూస్తున్నాయి జాగ్రత్త..
Follow us
Basha Shek

|

Updated on: Nov 06, 2021 | 5:54 PM

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ షాపింగ్‌మాల్‌ ట్రయల్‌ రూంలో యువతి దుస్తులు మార్చుకుంటుండగా పక్క రూం నుంచి ఇద్దరు యువకులు సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన సంగతి తెలిసిందే. దీనిని గమనించిన యువతి కేకలు వేయడంతో అక్కడున్న వారు యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని స్టోర్‌ మేనేజర్‌పై కూడా కేసు నమోదుచేశారు. ఈ సంఘటనతో హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌లో మహిళల భద్రతపై మరోసారి అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా అక్కడి సీసీ కెమారాలు, సెల్‌ఫోన్‌ కెమెరాలు కంటికి కనిపించని శత్రువుల్లా తయారయ్యాయి. అమ్మాయిలు కొంచెం ఆదమరుపుగా ఉంటే చాలు..వీడియోలు తీస్తున్నారు. అనంతరం సోషల్‌ మీడియోలో అప్‌లోడ్‌ చేస్తామంటూ బ్లాక్‌మెయిల్‌ చర్యలకు పాల్పడుతున్నారు. దేశ రాజధాని దిల్లీ, ముంబయి, బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ తరచచూ ఇటువంటి కేసులు బయటపడుతున్నాయి.

పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లోని హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌లోకి వెళ్లినప్పుడు ఆడవారు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హైదరాబాద్‌ నగరాన్నే తీసుకుంటే భారీ, మధ్యతరహా షాపింగ్‌ మాల్స్‌ అన్నీ కలిపి మొత్తం 1500 వరకూ ఉంటాయని అంచనా. వీటిలో సగానికిపైగా వస్త్ర దుకాణాలే ఉంటాయి. ఇక హోటళ్లు అంతకు రెండు రెట్లు ఉన్నాయి. ఈ క్రమంలో కొందరు పోకిరీలు హోటళ్లలోని స్నానాల గదులు, షాపింగ్‌ మాల్స్‌లో దుస్తులు మార్చుకునే గదుల్లోనే రహస్య కెమెరాలు పెడుతున్నారు.

కేంద్రమంత్రికి కూడా తప్పలేదు.. 2019, సెప్టెంబర్‌ 5న దిల్లీలోని గ్రేటర్ కైలాష్ ఎం బ్లాక్ లోని ఓ మాల్‌లో దుస్తులు కొనడానికి వచ్చిన ఓ మహిళ జర్నలిస్టు ట్రయల్ రూమ్‌కు వెళ్లింది. అయితే రహస్య కెమెరాలతో చిత్రీకరించడం గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. షాపింగ్‌మాల్‌ యజమానిపై కేసు నమోదైంది.

2016, జూలై 29న ఆశిష్ శర్మ అనే ఓ 34 ఏళ్ల లాయర్‌ తన షూలో కెమెరాను ఏర్పాచేసుకుని షాపింగ్‌ మాల్స్‌ కు వెళ్లాడు. ట్రయల్‌ రూంలో మహిళలు దుస్తులు మార్చుకుంటుండగా..కెమెరా ఉన్న షూను ట్రైయల్‌ రూం తలుపు కిందకు పోనిచ్చి కెమెరాలో రికార్డు చేస్తుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

2015, జూలై 14న కేరళలోని కోచ్చి నగరంలో ప్రసిద్ధి చెందిన మాల్ లోని గార్మెంట్స్ షోరూంలో ఒక మహిళ దుస్తులు మార్చుకునేందుకు లేడీస్ ట్రయల్ రూంకు వెళ్లింది. అక్కడ మొబైల్ కెమెరాను గుర్తించి వెంటనే షో రూం మేనేజర్, యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. చివరికి అది ఒక సేల్స్ మెన్‌ పని అని గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు.

2015, ఏప్రిల్‌ 2న గోవాలోని కాండోలిమ్ ప్రాంతంలో గల ప్రముఖ వస్త్ర దుకాణం ఫ్యాబ్ ఇండియాకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెళ్లారు. తనకు నచ్చిన దుస్తులను తీసుకుని ట్రయల్‌ రూంకు వెళ్లారు. రూంలో రహస్య కెమెరాలు కంటపడడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

2014, అగస్టు 11… కర్ణాటకలోని బసవన్నగుడి దుస్తుల షోరూమ్ నిర్వహిస్తున్న సందీప్, సురేష్, సునీల్‌ అనే సోదరులు లేడీస్ ట్రయల్‌ రూంలో రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. మహిళలు దుస్తులు మార్చుకునే దృశ్యాలు రికార్డు చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి గుట్టు రట్టయింది.

టాయిలెట్లలోనూ.. ఉత్తర ప్రదేశ్‌ మీరట్‌ నగరంలోని సర్దార్ బజార్ రిషబ్ అకాడమీ స్కూల్ సెక్రటరీ రంజిత్ జైన్, అతని కుమారుడు అభినవ్‌ జైన్ నీచానికి పాల్పడ్డారు. కరోనా కారణంగా స్కూల్ మూతపడి జీతాల్లేక అల్లాడుతున్న లేడీ టీచర్లపై ఆకృత్యాలకు ఒడిగట్టారు. జీతాలు చెల్లించాలని అడిగినందుకు టీచర్ల టాయిలెట్‌లలో సీక్రెట్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనంతరం బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. లేడీ టీచర్లు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.

ఈ జాగ్రత్తలు పాటించండి… ట్రయల్‌ రూంలలో కొన్ని ఫేక్ మిర్రర్లు పెట్టి వాటి వెనకాల కెమెరాలు పెడుతున్నారు. కాబట్టి మహిళలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆ మిర్రర్ ఒరిజినల్ కాదా అన్నది తెలుసుకోవాలి. అదేవిధంగా ట్రయల్ రూంలలో వేలాడబడి ఉండే లైట్లలోనూ కెమెరాలు అమర్చుతున్నారు. అదేవిధంగా రూంలోని హ్యాంగర్లు, స్క్రూలు, ఇతర ప్రదేశాలు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇక టాయిలెట్లను వినియోగించేముందు హిడెన్ కెమెరాలు, స్పై కెమెరాలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. గదుల్లో ఏవైనా చిన్న రంధ్రాలు కనిపిస్తే అక్కడ సీక్రెట్ కెమెరాలు ఉండే అవకాశం ఉంటుందని భావించాలి. ట్రయల్ రూమ్ కు వెళ్లిన సమయంలో అద్దం సింగిల్ సైడ్ అద్దమో, డబుల్ సైడ్ అద్దమో చెక్ చేసుకోవాలి. వేలి మధ్య గ్యాప్ ఉంటే అది సింగిల్ సైడెడ్ అద్దం అని వేలి మధ్య గ్యాప్ లేకపోతే అది డబుల్ సైడెడ్ అద్దం అని తెలుసుకోవాలి. స్పై కెమెరాలు ఉన్న గది నుంచి సిగ్నల్ సమస్యలు వస్తే కాల్ డ్రాప్స్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఇక గదిలో లైట్లను ఆర్పి మొబైల్ కెమెరా ఫ్లాష్ ను ఆన్ చేయడం ద్వారా కూడా సీక్రెట్ కెమెరాను గుర్తించవచ్చు. ఫోన్ లో హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ను ఇన్ స్టాల్ చేయడం ద్వారా కూడా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు.

కఠిన శిక్షలు తప్పవు.. సెక్షన్ 354 సి అండ్ డి ప్రకారం మహిళలను నగ్నంగా, అసభ్యంగా చూడటం, చిత్రీకరించడం, వేధించడం నేరం. దీనికి ఏడాది నుంచి 3 ఏళ్ల వరకూ శిక్ష, జరిమానా ఉంటాయి . నేర తీవత్రను బట్టి శిక్ష 7 ఏళ్ల వరకూ విధించేందుకు కూడా అవకాశం ఉంది.

Also Read:

Viral News: తాగి ఇంకొకరి ఇంటికి వెళ్లిన మాజీ ఎంపీ.. రక్తం వచ్చేలా కొట్టిన యజమాని

Vizag Crime News: విశాఖ జిల్లాలో హత్యా రాజకీయాలు.. లైన్ మెన్ బంగార్రాజు హత్య కేసులో గంటకో ట్విస్ట్..

Swapna Suresh: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. 16 మాసాల తర్వాత జైలు నుంచి స్వప్న సురేష్‌ విడుదల

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే