Swapna Suresh: కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. 16 మాసాల తర్వాత జైలు నుంచి స్వప్న సురేష్ విడుదల
Kerala Gold Smuggling Case: స్వప్న సురేష్.. కేరళలో ఈ పేరు ఓ సంచలనం. గత ఏడాది కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ ప్రధాన నిందితురాలు.
Kerala Gold Smuggling Case: స్వప్న సురేష్.. కేరళలో ఈ పేరు ఓ సంచలనం. గత ఏడాది కేరళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ ప్రధాన నిందితురాలు. ఈ కేసులో అరెస్టై 16 మాసాలుగా కారాగార జీవితం గడుపుతున్న ఆమె.. శనివారం తిరువనంతపురం జిల్లా ఆట్టకులంగర జైలు నుంచి విడుదలయ్యారు. స్వప్న సురేష్ తల్లి బెయిల్ కాపీతో జైలుకు చేరుకుని.. ఆమెను విడిపించుకుని తన వెంట తీసుకెళ్లారు.
కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED), కస్టమ్స్ శాఖ దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(UAPA) కింద గత ఏడాది జూలై 11న స్వప్న సురేష్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆమె జైల్లోనే ఉన్నారు. ఇటీవల ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా నవంబర్ 2న కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 లక్షల బాండు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది. ఎన్ఐఏ అభియోగాలు మోపినట్లు స్వప్న సురేష్‌కు తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్లు ప్రాథమిక నిర్థారణ కాలేదని కోర్టు తెలిపింది.
కేరళలో దౌత్య మార్గాల ద్వారా బంగారం స్మగ్లింగ్ జరగడకం సంచలనం సృష్టించింది. తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో రూ.14.82 కోట్ల విలువ చేసే 30 కిలోల బంగారం పట్టుబడింది. దౌత్యపరమైన పార్శిల్ పేరుతో తరలిస్తున్న బ్యాగేజీపై అనుమానం వచ్చి కస్టమ్స్ అధికారులు చెక్ చేయడంతో స్మగ్లింగ్ బండారం బయటపడింది.
Also Read..
Komatireddy Venkat Reddy: రేపటినుంచి నా తడాఖా ఎంటో చూపిస్తా.. ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Haritha Haram: హరిత హారం చెట్టు కొమ్మలను నరికినందుకు రూ.5వేల జరిమానా.. ఎక్కడంటే..
Wegovy: స్థూలకాయస్థులకు శుభవార్త.. బరువు తగ్గించే ఇంజక్షన్ వచ్చింది.. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?