జయలలిత కుమార్తె నేనే.. తలైవి సమాధి వద్ద ఓ మహిళ హల్‌చల్.. తమిళనాట సంచలనం

తమిళనాట మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జయలలిత కుమార్తె తానేనంటూ చెన్నైలోని ఆమె సమాధి వద్ద ఓ మహిళ హల్‌చల్ చేసింది.

జయలలిత కుమార్తె నేనే.. తలైవి సమాధి వద్ద ఓ మహిళ హల్‌చల్.. తమిళనాట సంచలనం
Jayalalitha, Prema
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 06, 2021 | 4:05 PM

తమిళనాట మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. జయలలిత కుమార్తె తానేనంటూ చెన్నైలోని ఆమె సమాధి వద్ద ఓ మహిళ హల్‌చల్ చేసింది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రేమ.. మెరీనా తీరంలోని జయలలిత సమాధి దగ్గర నివాళులర్పించారు. దీపావళి సందర్భంగా అమ్మ సమాధి వద్ద ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చినట్లు ఆమె మీడియాకు తెలిపారు. అయితే భద్రతా సిబ్బంది తనను అమ్మ సమాధిని దర్శించుకునేందుకు అనుమతివ్వలేదని వాపోయారు. వారి అనుమతితో మరుసటి రోజు అమ్మ సమాధిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.

తన స్వస్థలం మైసూరుగా వెళ్లడించిన ఆమె.. గత 30 ఏళ్లుగా చెన్నైలోని పల్లావరం ప్రాంతంలో నివాసముంటున్నట్లు తెలిపారు. ఇక్కడికి రాకూడదని తాను భావించానని.. అయితే అమ్మ జ్ఞాపకాలతో మనోవేదన ఎక్కువ అవుతున్నందున సమాధిని దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. జయలలిత కుమార్తె అయితే ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. దానికి కారణాలు ఉన్నందునే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు.

జయలలిత కుమార్తె తానేనని నిరూపించేందుకు అవసరమైన అన్ని ఆధారాలు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఒక శుభదినాన్ని ఆ వివరాలను మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. చట్టబద్ధంగానూ తాను జయలలిత కుమార్తెగా నిరూపించే పక్కా ఆధారాలు తన దగ్గరున్నట్లు తెలిపారు. తనను పెంచిన తండ్రి.. మైసూరులో ఉండేవారని, ఇటీవల ఆయన మరణించినట్లు చెప్పుకున్నారు. త్వరలోనే తాను శశికళను కలవనున్నట్లు వెల్లడించారు. శశికళను కలిసేందుకు అపాయింట్‌మెంట్ లభించినట్లు తెలిపిన ఆమె.. మూడు నాలుగు రోజుల్లోనే ఆమె కలుస్తానని వెల్లడించారు.

జయలలిత పోయస్ గార్డెన్‌లోని ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి నేరుగా వెళ్లి కలిసినట్లు ఆ మహిళ తెలిపారు. ఆ తర్వాత ఆమె అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మరోసారి నేరుగా ఆస్పత్రికి వెళ్లి ఆమెను కలిసినట్లు వెల్లడించారు. తనకు తెలిసి రెండుసార్లు మాత్రమే జయలలితను నేరుగా కలిసినట్లు తెలిపారు.  తన పేరు ప్రేమ.. అయితే అమ్మ(జయలలిత) ముద్దుగా తనను జయలక్ష్మి అని పిలిచేవారని ఆమె వెల్లడించారు.

జయలలిత మరణం తర్వాత తాను తీవ్ర మనోవేధనతో ఉన్నందునే.. ఇన్ని రోజులు బయటకు రాలేకపోయినట్లు చెప్పుకొచ్చారు. చాలా ప్రశ్నలకు త్వరలోనే చెబుతా.. త్వరలోనే మీకు తెలుస్తుందంటూ ఆమె సమాధానాలిచ్చారు.

Also Read..

Andhra Pradesh: ఫస్ట్ క్లాస్ ఆలుగడ్డలు అనుకోకండి.. అసలు యవ్వారం వేరే ఉంది.. పక్కా స్కెచ్

Chiranjeevi: చిరు అంటే సీన్ ఇలా ఉంటది.. ఐదుగురు టాప్ డైరక్టర్ల సమక్షంలో మెగాస్టార్ 154వ మూవీ లాంచ్

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే