Andhra Pradesh: ఫస్ట్ క్లాస్ ఆలుగడ్డలు అనుకోకండి… అసలు యవ్వారం వేరే ఉంది.. పక్కా స్కెచ్

గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాలు కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు. రోజుకో కొత్త పద్దతిలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే షాక్ ఇస్తున్నారు కేటుగాళ్లు.

Andhra Pradesh:  ఫస్ట్ క్లాస్ ఆలుగడ్డలు అనుకోకండి... అసలు యవ్వారం వేరే ఉంది.. పక్కా స్కెచ్
Ganja Smuggling
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 06, 2021 | 3:56 PM

గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠాలు కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు. రోజుకో కొత్త పద్దతిలో మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తూ.. అధికారులకే షాక్ ఇస్తున్నారు కేటుగాళ్లు. ఇప్పటివరకు సరుకుల మాటున.. పండ్ల లోడు మాటున.. పాల వ్యాన్లు లోపల… ఆర్టీసీ బస్సుల్లో గంజాయి అక్రమ రవాణా చేయడం చూశాం. చివరికి గ్యాస్ సిలిండర్‌లు తెస్తున్నా వాటిని కూడా క్యాప్ ఓపెన్ చేసి చూడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఏపీ సర్కార్ గంజాయి సాగు, రవాణాపై చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. ఓ వైపు గంజాయి సాగు ధ్వంసం కొనసాగుతుంటే… మరోవైపు గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా సాగుతుంది. ఏజెన్సీ నుంచి వచ్చే ఏ వస్తువునైనా అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది.  తాజాగా విశాఖలో పెద్ద మొత్తంలో తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. అగనంపూడి టోల్ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేపట్టిన సెబ్‌ అధికారులు.. అనుమానంతో ఐచర్ వ్యాన్‌‌ను ఆపి సోదాలు చేశారు. వాహనంలో తరలిస్తున్న వందల కేజీల గంజాయిని సీజ్ చేశారు.

పోలీసులు గంజాయి సాగును ఏ మాత్రం ఉపేక్షించబోమన్న సంకేతాలు ఇస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే పండిన పంటను ఎలాగైనా సరిహద్దులు దాటించడానికి ఎంతకైనా బరితెగిస్తున్నారు స్మగ్లర్లు. అమాయక గిరిజనులకు భారీ డబ్బు ఆశ చూపి గంజాయిని సరిహద్దు దాటించే బాధ్యతను వాళ్లకు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బంగాళదుంప బస్తాల లోడు మాదిరిగా కళ్లుగప్పి అడుగున గంజాయి రవాణాకు దుండగులు యత్నించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన దువ్వాడ పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వ్యాన్, గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ప్రేయసిని పరిచయం చేసిన టీమిండియా స్టైలిష్ ఓపెనర్.. వైరలవుతోన్న కేఎల్ రాహుల్ జోడీ ఫొటో

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే