KL Rahul-Athiya Shetty: ప్రేయసిని పరిచయం చేసిన టీమిండియా స్టైలిష్ ఓపెనర్.. వైరలవుతోన్న కేఎల్ రాహుల్ జోడీ ఫొటో

IND VS SCO: కేఎల్ రాహుల్ స్కాట్లాండ్‌పై కేవలం 18 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. భారత్ కేవలం 39 బంతుల్లో మ్యాచ్ గెలిచింది.

KL Rahul-Athiya Shetty: ప్రేయసిని పరిచయం చేసిన టీమిండియా స్టైలిష్ ఓపెనర్.. వైరలవుతోన్న కేఎల్ రాహుల్ జోడీ ఫొటో
T20 World Cup 2021, India Vs Scotland
Follow us

|

Updated on: Nov 06, 2021 | 11:03 AM

KL Rahul-Athiya Shetty: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి అతియా శెట్టి. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ‘హ్యపి బర్త్‌డే మౌలవ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి అసలు విషయం తెలిపాడు. అయితే, ఇంతకు ముందు వీరిద్దరు ఫొటోలు నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. వీరిద్దరు లవర్ అని ఇంతకుముందే తెగ రూమర్స్ వచ్చాయి. టీ20 ప్రపంచకప్ 2021లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమ్‌ఇండియా తర్వాతి రెండు మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా ఆడి విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్‌ను 66 పరుగుల తేడాతో ఓడించిన టీమ్ ఇండియాకు స్కాట్లాండ్‌పై భారీ విజయం అవసరం. శుక్రవారం కూడా అలాంటిదే కనిపించింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత స్కాట్లాండ్‌ను 85 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా ఆ తర్వాత కేవలం 39 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. షమీ-జడేజా తలో 3 వికెట్లు తీయడం ద్వారా టీమ్ ఇండియా విజయానికి చాలా దోహదపడ్డారు. అయితే నెట్ రన్ రేట్‌ను కేఎల్ రాహుల్ కాపాడాడు.

కేఎల్ రాహుల్ కేవలం 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి, 6.3 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టడం ద్వారా టీ20 ప్రపంచ కప్ 2021లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీని సాధించాడు. కేఎల్ రాహుల్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 263.16గా ఉంది. అభిమానులందరూ కేఎల్ రాహుల్ ఈ ఇన్నింగ్స్‌కి ఫిదా అవుతున్నారు. అయితే కేఎల్ రాహుల్ ప్రేయసి, నటి అథియా శెట్టి కూడా చాలా సంతోషంగా కనిపించింది.

కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ తర్వాత, నటి అతియా శెట్టి ఫోటో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అయ్యింది. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే అతియా శెట్టి ఎంతో ఉత్సాహంతో చప్పట్లు కొడుతూ కనిపించింది. కేఎల్ రాహుల్ ఈ సూపర్ ఇన్నింగ్స్ అతియా శెట్టికి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజు ఈ నటి పుట్టినరోజు. టీమ్ ఇండియా సూపర్ స్టార్ మైదానంలో అద్భుత ఇన్నింగ్స్ ఆడి మంచి బహుమతిని అందించాడు. అద్భుతమైన అర్ధ సెంచరీ, టీమ్ ఇండియా భారీ విజయం తర్వాత కేఎల్ రాహుల్ స్నేహితురాలు అతియా శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. దీని క్యాప్షన్ చాలా కూడా ప్రత్యేకంగా అందిచాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు. మై లవ్. (లవ్ ఎమోజీ) అతియా శెట్టిని తాను ప్రేమిస్తున్నానని రాహుల్ సోషల్ మీడియాలో మొదటిసారి అంగీకరించాడు.

టీ20 ప్రపంచకప్‌లో మూడో వేగవంతమైన అర్ధశతకం.. ప్రపంచకప్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన పరంగా కేఎల్ రాహుల్ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2007లో ఇంగ్లండ్‌పై కేవలం 12 బంతుల్లోనే యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించాడు. 2014లో స్టీఫెన్ మైబర్గ్ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో, గ్లెన్ మాక్స్‌వెల్, కేఎల్ రాహుల్ 18 బంతుల్లో అర్ధ సెంచరీలు సాధించారు. కేఎల్ రాహుల్‌కి ఇది వరుసగా రెండో ఫిఫ్టీ. అఫ్గానిస్థాన్‌పై కూడా రాహుల్ 69 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by KL Rahul? (@rahulkl)

Also Read: T20 World Cup 2021: టీమిండియా సెమీస్ ఆశలు సజీవం.. కానీ అలా జరిగితేనే..

ENG vs SA, T20 World Cup 2021: దక్షిణాఫ్రికా సెమీఫైనల్ బెర్త్ సాధిస్తుందా? ఇంగ్లండ్‌తో కీలక మ్యాచులో తేలనున్న ఫలితం..!

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!