Watch Video: రోహిత్, రాహుల్ బౌండరీలు, సిక్సర్ల వర్షం.. మ్యాచ్ హైలైట్స్ చూసేయండి
టీ20 ప్రపంచకప్2021లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. స్కాట్లాండ్‌పై గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది.
T20 World Cup 2021, IND vs SCO: టీ20 ప్రపంచకప్2021లో టీమిండియా వరుసగా రెండో విజయం సాధించింది. స్కాట్లాండ్‌పై గెలిచి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. సూపర్ 12 గ్రూపులో మొదటి రెండు మ్యాచుల్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ టీంలతో పరాజయం పాలైంది. దీంతో అఫ్గాన్, స్కాట్లాండ్ టీంలపై భారీ విజయాలు సాధించాల్సిన అవసరం ఏర్పండింది. అలానే టీమిండియా స్కాట్లాండ్‌పై భారీ విజయం సాధిచింది. ఈ విజయంతో నెట్ రన్ రేట్‌ను భారీగా పెంచుకుంది. ఇక భారత్ ఆశలన్నీ న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచుపై ఆధారపడ్డాయి. ఈ మ్యాచులో ఆఫ్ఠనిస్తాన్ టీం గెలిస్తేనే టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్తుంది.
అయితే నిన్న విరాట్ కోహ్లీ బర్త్‌డే సందర్భంగా జరిగిన ఈ మ్యాచులో తొలిసారి టీమిండియా సారథి టాస్ గెలిచాడు. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో కేవలం ఒక్కసారే టాస్ గెలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన షమీ, జడేజా తలో 3 వికెట్లు సాధించారు. బుమ్రా 2 వికెట్లతో రాణించాడు. దీంతో స్కాట్లాండ్ టీం 85 పరుగులకే ఆలౌట్ అయింది. 17వ ఓవర్‌లో షమీ వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఇందులో ఒకటి రనౌట్ కావడంతో షమీ హ్యాట్రిక్ మిస్సయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ (50), రోహిత్ శర్మ (30) తుఫాన్ బ్యాటింగ్ చేయడంతో కేవలం 6.3 ఓవర్లలోనే టార్గెట్‌ను సాధించింది. అయితే ఈ మ్యాచుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
View this post on Instagram
T20 World Cup 2021: టీమిండియా సెమీస్ ఆశలు సజీవం.. కానీ అలా జరిగితేనే..