- Telugu News Photo Gallery Cricket photos India Into Semifinal Race But New Zealand Vs Afghanistan Match Key To Kohli Team
T20 World Cup 2021: టీమిండియా సెమీస్ ఆశలు సజీవం.. కానీ అలా జరిగితేనే..
పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోర పరాజయాలు అందుకున్న టీమిండియా దాదాపుగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిందని...
Updated on: Nov 06, 2021 | 9:59 AM

పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో ఘోర పరాజయాలు అందుకున్న టీమిండియా దాదాపుగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిందని అందరూ అనుకున్నారు. అయితే ఆఫ్గనిస్తాన్, స్కాట్‌ల్యాండ్ మ్యాచ్‌ల్లో అద్భుతమైన పోరాటాన్ని కనబరిచి మళ్లీ సెమీఫైనల్ రేసులోకి దూసుకొచ్చింది కోహ్లీసేన. అయితే ప్రస్తుతం టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే.. ఆదివారం జరగబోయే న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ కీలకం కానుంది. అదెలాగంటే..

న్యూజిలాండ్ వెర్సస్ ఆఫ్గనిస్తాన్: ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం సాధిస్తే.. టీమిండియా ఇంటి ముఖం పట్టాల్సిందే. అలా కాకుండా ఆఫ్గనిస్తాన్ విజయం సాధిస్తే.. టీమిండియా సెమీస్ వెళ్లేందుకు మార్గం సుగుమం అవుతుంది.

ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్‌ను ఓడించి, నమీబియాను టీమిండియా ఓడిస్తే.. మూడు జట్లకు 6 పాయింట్స్ ఉంటాయి. ఇక ఇందులో కోహ్లీసేన నెట్ రన్‌రేట్ అమోఘంగా ఉంది.

భారత నికర రన్ రేట్ +1.619 కాగా, ఆఫ్ఘనిస్తాన్ +1.481, న్యూజిలాండ్ రన్ రేట్ +1.277గా ఉంది. న్యూజిలాండ్-ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ తర్వాత ఈ రెండు జట్లకు పెద్దగా నెట్ రేట్ జత కాదు.. ఒకవేళ ఆఫ్గనిస్తాన్ నెట్ రన్ రేట్‌లో మార్పులు ఉన్నా కూడా.. నమీబియాపై టీమిండియా భారీ పరుగుల తేడాతో గెలుస్తుంది కాబట్టి.. ఎలాగైనా ఇండియానే నెట్ రన్‌రేట్‌లో అగ్రస్థానంలో ఉంటుంది.

ఏది ఏమైనా ఆఫ్గనిస్తాన్ మ్యాచ్.. టీమిండియా సెమీస్ ఆశలను సజీవం చేస్తుందా.? నీరు కారుస్తుందా.? అనేది చూడాలి. ఇప్పుడు కోహ్లీసేన కోరుకోవాల్సింది ఒకటి న్యూజిలాండ్ ఓడిపోవాలి.





























