Virat Kohli Birthday: ధోని కెప్టెన్సీలో కోహ్లీ పుట్టిన రోజు వేడుకలు.. రచ్చ చేసిన టీంమేట్స్.. వైరలవుతోన్న వీడియో
T20 World Cup 2021: స్కాట్లాండ్‌పై భారత్ విజయం సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ పుట్టినరోజు వేడుకలను ఎంఎస్ ధోని సారథ్యంలో నడిపించాడు.
Virat Kohli Birthday: టీ20 ప్రపంచ కప్ 2021లో స్కాట్లాండ్‌పై విజయం తర్వాత, టీమిండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టినరోజును డ్రెస్సింగ్ రూమ్‌లో నిర్వహించారు. విరాట్ కోహ్లీ శుక్రవారం తన 33వ పుట్టినరోజును చేసుకున్నాడు. స్కాట్లాండ్‌పై అద్భుతమైన విజయంతో కోహ్లీ టీం ఖచ్చితమైన బహుమతిని అందుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌కు చేరుకోవాలనే భారత ఆశలను సజీవంగా ఉన్నాయి . స్కాట్లాండ్‌పై విజయం సాధించిన తర్వాత, టీం ఇండియా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కేక్ కట్ చేసి, డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ కోహ్లీ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నారు. మెంటర్ ఎంఎస్ ధోని సారథ్యంలో కోహ్లీ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
వీడియోలో, కోహ్లీ కేక్ కట్ చేసి ధోనీతో పాటు జట్టులోని ఇతర సభ్యులకు తినిపించడం మనం చూడొచ్చు. చుట్టూ నిలబడిన మిగతా సహచరులు నవ్వుతూ సందడిగా కనిపించారు.
స్కాట్లాండ్‌పై భారీ విజయంతో భారత్ నెట్ రన్ రేట్ గ్రూప్ 2లో అత్యుత్తమంగా నిలిచింది. భారత్ 4 మ్యాచ్‌లలో 2 విజయాలతో 4 పాయింట్లను కలిగి ఉంది. నెట్ రన్ రేట్ (+1.619)లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో టీమిండియా మూడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా నమీబియాపై భారీ విజయం సాధించాలి. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచులో ఆఫ్ఘన్ గెలవాలని ఆశించాలి. అప్పుడే సెమీఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.
Cake, laughs and a win! ? ? ?#TeamIndia bring in captain @imVkohli‘s birthday after their superb victory in Dubai. ? ? #T20WorldCup #INDvSCO pic.twitter.com/6ILrxbzPQP
— BCCI (@BCCI) November 5, 2021
Also Read: Watch Video: రోహిత్, రాహుల్ బౌండరీలు, సిక్సర్ల వర్షం.. మ్యాచ్ హైలైట్స్ చూసేయండి