Vizag Crime News: విశాఖ జిల్లాలో హత్యా రాజకీయాలు.. లైన్ మెన్ బంగార్రాజు హత్య కేసులో గంటకో ట్విస్ట్..

Visakhapatnam Crime News: విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఏనుగుల పాడు లో ఈనెల 3 వ తేదీ చోటుచేసుకున్న హత్యోదంతం గంటకో మలుపు తీసుకుంటుంది.

Vizag Crime News: విశాఖ జిల్లాలో హత్యా రాజకీయాలు.. లైన్ మెన్ బంగార్రాజు హత్య కేసులో గంటకో ట్విస్ట్..
Crime News
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 06, 2021 | 4:46 PM

Visakhapatnam Crime News: విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఏనుగుల పాడు లో ఈనెల 3 వ తేదీ చోటుచేసుకున్న హత్యోదంతం గంటకో మలుపు తీసుకుంటుంది. ప్రస్తుతం అది ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఇద్దరు నాయకుల అంతర్గత పోరు దీనికి కారణమయ్యిందా.. అన్న అనుమానాలను వాళ్ళలోనే ఒక వర్గం వ్యక్తం చేసే దిశకు చేరుకుంది. రాష్ట్రంలో రాజకీయాలు ఏ దశకు చేరాయి? అధికార పార్టీలో అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉంది? శాంతి భద్రతల పరిరక్షణలో పరిమితమవుతోన్న పోలీస్ పాత్ర, సామాజిక వర్గాల మధ్య పోరు…. అనేక అంశాలను స్పృశిస్తూ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోన్న ఈ హత్యోదంతం పూర్వ పరాలను ఒకసారి చూద్దాం.

ఈ నెల మూడో తేదీన భీమిలి నియోజకవర్గం లోని ఏనుగుల పాడు గ్రామ శివార్లలోని ఒక ఫార్మ్ హౌస్ సమీపంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ బంగార్రాజు మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. మొదట అనుమానాస్పద కేసుగా నమోదైన కేసు తరువాత హత్యకేసుగా మారింది. బంగార్రాజు స్నేహితుడు గోవింద్ అనే వ్యక్తి చివరి సారి కాల్ చేయడం, అతని దగ్గరకు వెళ్లిన తరువాత 2 రోజులు కనపడకుండా మూడో రోజు నిర్జీవంగా ఫార్మ్ హౌస్ పక్కనే పడి ఉండడంతో గోవింద్ ను అదుపులోకి తీసుకున్న పోలీస్ లు అనుమానాస్పద కేసును హత్య కేసుగా మార్చారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది.

ట్విస్ట్ ఏంటంటే.. బంగార్రాజు మృతదేహం సమీపంలో ఉన్న ఫార్మ్ హౌస్ రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు కోరాడ లక్ష్మణ్ ది. బంగార్రాజు కేసులో పోలీస్ ల అదుపులో ఉన్న గోవింద్ లక్ష్మణ్ ఇద్దరు స్నేహితులు కావడం, వీళ్ళ మధ్య గతంలో ఏవో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. దీంతో బంగార్రాజు హత్య లో గోవింద్ తో పాటు కోరాడ లక్ష్మణ్ పాత్ర కూడా ఉందని అతన్ని అరెస్ట్ చేయాలని మృతుని బంధువులు మొదటినుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ ఈ ఉదంతం మరో మలుపు తీసుకుంది. హత్య కు గురికాబడ్డ లైన్ మెన్ బంగార్రాజు యాదవ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో మృతుల బంధువులకు మద్దతుగా యాదవ సామాజిక వర్గం అంతా ఏకమైంది. కోరాడ లక్ష్మణ్ ను అరెస్ట్ చేసేవరకు సహించబోమంటూ రాజకీయ పార్టీలకు అతీతంగా యాదవులు ఏకమై నిరసనకు దిగారు. వీళ్ళు ఆరోపిస్తోన్న కోరాడ లక్ష్మణ్ ఉత్తర కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఇది యాదవ్- కాపు సామాజిక వర్గాల పోరు గా మారింది.

మరి ఇంత జరుగుతుంటే పోలీస్ పాత్ర ఏంటి అన్న సందేహం వస్తుంది కదా! పోలీస్ లు యధావిధిగా మొదట అనుమానాస్పద కేసు, తర్వాత హత్య కేసు గా మార్చి కేవలం ఒక్క గోవింద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెబుతున్నారు. లక్ష్మణ్ పాత్ర ఇంకా నిర్దారణ కాలేదని, నిర్దారణ అయితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని కూడా చాలా గట్టిగానే చెబుతున్నారు.

ఇక్కడే కథ పీక్స్ కి వెళ్ళింది. మొత్తం ఎపిసోడ్ లో కీలక భాగం ప్రస్తుతం నడుస్తోంది. మర్డర్ కేసుగా మార్చిన తరువాత మృతదేహానికి పోస్ట్ మార్టం చేసి మృతుడి కుటుంబసభ్యులకు ఇచ్చే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే మృతుని కుటుంబీకులు అందుకు నిరాకరించారు. కోరాడ లక్ష్మణ్ పేరు హత్య కేసులో చేర్చి అతన్ని అరెస్ట్ చేసేవరకు మృతదేహాన్ని తీసుకోబోమంటూ కె జీ హెచ్ మార్చురీ వద్ద నిరసనకు దిగారు. అక్కడ నుంచి కలెక్టరేట్ వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అది కాస్తా ఉద్రిక్తంగా మారింది.

ఆందోళన పర్వంలో కూడా విపరీతమైన సస్పెన్స్ నడుస్తోంది. మృతుని బంధువులకు మద్దతుగా జనసేన, టీడీపీ లకు చెందిన యాదవ నాయకులతో పాటు వైసీపీ కి చెందిన కీలక నేతలు ఆందోళనలో పాలుపంచుకోవడం పెద్ద ట్విస్ట్ గా మారింది.

ఆందోళనలో వైసీపీ నాయకులు పాల్గొన్నాడని బొత్సా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. దీని వెనుక అధికార పార్టీ కీలక నేతలు ఎవరైనా ఉన్నారా అన్న సందేహం బొత్సా వర్గంలో వినిపిస్తోంది. లేదంటే అంత ధైర్యంగా వీఎమ్మార్డీఏ చైర్మన్ గా ఉన్న అక్కరమాని వర్గీయులు పాల్గొంటారా అన్నది వీళ్ళ అనుమానం. ఎవరో కీలక, అదృశ్య శక్తులు వెనక ఉండడం వల్లనే ఇష్యూ ఈ స్థాయికి చేరిందన్నది ఈ వర్గం అనుమానం.

ఇంకా ఈ వివాదం ఇలానే కొనసాగుతూనే ఉంది. పోలీస్ లు మాత్రం యధావిధిగా చట్టం తమ పని తాను చేసుకుపోతోంది అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇన్ని ట్విస్ట్ లతో సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోన్న ఈ మర్థర్ కేసు క్లైమాక్స్ ఎలా ఉండబోతోందో అన్న ఆందోళన అందరిలో నెలకొంది.

ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. ఈ హత్య కేసుపై ఏపీ డిజిపి గౌతమ్ సవాంగ్‌కి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. విశాఖ జిల్లాలో లైన్ మెన్ బంగార్రాజు హత్యకు గురయ్యాడని.. ఆయన డెడ్ బాడీ మంత్రి బొత్స బంధువులు గెస్ట్ హౌస్‌లో దొరికిందని తెలిపారు. లైన్ మెన్ హత్యలో వైసీపీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. హతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోకుండా.. కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. హత్య చేసిన నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బంగార్రాజు కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు కోరారు.

Also Read..

Allu Arjun: మరో బిజినెస్ మొదలు పెట్టిన ఐకాన్ స్టార్.. థియేటర్ ఓనర్‌గా అల్లు అర్జున్

జయలలిత కుమార్తె నేనే.. తలైవి సమాధి వద్ద ఓ మహిళ హల్‌చల్.. తమిళనాట సంచలనం

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!