Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: మరో బిజినెస్ మొదలు పెట్టిన ఐకాన్ స్టార్.. థియేటర్ ఓనర్‌గా అల్లు అర్జున్

సినిమాతారలు పలు రకాల వ్యాపారాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు హీరో, హీరోయిన్లు గా చేస్తూనే మరో వైపు వ్యాపారాలతోనూ దూసుకుపోతున్నారు.

Allu Arjun: మరో బిజినెస్ మొదలు పెట్టిన ఐకాన్ స్టార్..  థియేటర్ ఓనర్‌గా అల్లు అర్జున్
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 06, 2021 | 3:52 PM

Allu Arjun: సినిమాతారలు పలురకాల వ్యాపారాల్లోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు హీరో, హీరోయిన్లుగా చేస్తూనే మరో వైపు వ్యాపారాలతోనూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే, అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి హీరోలు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. అటు హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్, సమంత లాంటి వాళ్ళు కూడా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పటికే ఆహా ఓటీటీ మద్యంమంలో భాగస్వామిగా ఉన్నారు అల్లు అర్జున్. అలాగే అల్లు స్టూడియోస్ లోకూడా బన్నీకి భాగస్వామ్యం వుంది. ఇక ఇప్పుడు సరి కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు అల్లము అర్జున్.

ఏషియన్ గ్రూప్ తో కలసి ధియేటర్ నిర్మాణంలో భాగమయ్యారు ఐకాన్ స్టార్. వరల్డ్ క్లాస్ టెక్నాలజీ తో  హైదరాబాద్ లో థియేటర్ నిర్మిస్తున్నారు అల్లు అర్జున్. ఈ థియేటర్ నిర్మాణానికి ఈరోజు అల్లు అర్జున్  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఏఎంబీ పేరుతో థియేటర్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. అలాగే క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా మెహబూబ్ నగర్‌లో ఏషియన్ గ్రూప్‌తో కలిసి ఓ థియేటర్‌ను నిర్మించారు. ఇప్పుడు ఇదే బాటలో ఐకాన్ స్టార్ కూడా  థియేటర్ ఓనర్ అయ్యారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరాం దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమా చేయనున్నారు.Bunny

మరిన్ని ఇక్కడ చదవండి : 

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!