Jai Bhim: 37 ఏళ్ల ఘటనను గుర్తుచేసింది.. జైభీమ్ మూవీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన..

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో

Jai Bhim: 37 ఏళ్ల ఘటనను గుర్తుచేసింది.. జైభీమ్ మూవీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందన..
Jaibheem
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 06, 2021 | 1:53 PM

తమిళ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం జైభీమ్. టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‏లో విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఇందులో సూర్య నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 1993లో తమిళనాడులో గిరిజన మహిళ తరపున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇప్పుడు ఇదే కథాంశం తో సినిమా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మంచి టాక్‏తో.. ప్రశంసలు అందుకుంటూ దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ గురించి సీపీఐ జాతీయ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పందించారు. జైభీమ్ సినిమా .. తన జీవితంలో జరిగిన ఘటనను గుర్తుచేసిందన్నారు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. జైభీమ్ సినిమా చూశాను. నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కళ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్లు లేవు. ఉన్నతమైన నేటి సమాజం, ప్రత్యేకంగా యువ న్యాయవాది సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యతను, సందేశాత్మక సంకేతాలనే జై భీమ్ సినిమా సమాజానికి పంపింది. ప్రజా ఉద్యమాల్లోనే ఉంటున్న నాకు ఈ సినిమాలోని ఒక ఘట్టానికి అవినాభావ సంబంధం ఉంది. 37 ఏళ్ల కిందటి ఘటన కళ్ళముందు కదలాడింది. సినిమాలో సినతల్లి పెట్టిన కేసును ఎలాగైనా ఉపసంహరింప చేయాలని పోలీస్ బాస్… నీ భర్త ఎటు రాడు… కనీసం పరిహారం అందుకొని కోర్టు కేసు ఉపసంహారించుకో అన్న సందర్భంలో సినతల్లి ఇచ్చిన సమాధానం వ్యవస్థలకు దిమ్మతిరిగేలా ఉంటుంది. ఈ సందర్బంగా నేను చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శిగా వుండగా తిరుపతిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వచ్చింది.

నగరంలో కోతిని ఆడించుకొంటూ పొట్టపోసుకునే లక్ష్మి అనే మహిళ గూడు లేక రాత్రి సమయాల్లో ఏదో ఒక ప్లాట్ ఫారం పై పడుకునే అబాగ్యరాలు..ఒక రోజు రాత్రి బీట్ కానిస్టేబుల్స్ యదావిదిగా తమ లాటీలతో దబాయించుకుంటూ వస్తున్నారు. బిక్షగాళ్ళంతా భయపడి పరుగెత్తారు కోతిని ఆడించుకునే లక్ష్మి పరుగెత్తడానికి ప్రయత్నించే క్రమంలో పోలీసులు ఆమెను కాలితో తన్నడంతో ఆమె తల పక్కనే ఉన్న రాయికి బలంగా తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆ మృతదేహం పక్కన ఆమెకు జీవితం అయిన కోతి మాత్రమే ఉండిపోయింది. అదే సమయానికి సినిమాకు వెళ్ళిన పార్టీ యువజన సంఘం నాయకులు టీ కోసమని బస్ స్టాండుకు వచ్చిన క్రమంలో జరిగిన దారుణం వారి కంట పడింది. విషయం తెలియగానే యువజన నాయకులతో పాటు మేము కూడా ఘటనా స్తలానికి చేరుకున్నాం. తెల్లవారు జామున మృతదేహాన్ని తోపుడుబండిపై పడుకోబెట్టి నిరసన ప్రారంభించాం. నిరసన కేవలం 25 మందితోనే ప్రారంభమైంది. విషయం తెలియడంతో క్రమంగా వందల మంది జాతకలిశారు. లక్ష్మికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ మరుసటి రోజు బందుకు పిలుపునిచ్చాము. లక్ష్మి అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు ఆమె చేతిలో పెరిగిన కోతి ఆ మృతదేహాన్ని అంటి పెట్టుకొని ఉండడం నా హృదయాన్ని బరువెక్కించింది.

మేము బంద్‏కు పిలుపు ఇచ్చిన రోజునే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్‏టి రామారావు తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 11-12 గంటల సమయంలో కొందరు పోలీసులు వచ్చి నన్ను తిరుపతి ఎస్పీ క్యాంప్ కార్యాలయనికి తీసుకెళ్లారు. అక్కడ ఆనాటి కలెక్టర్ సుబ్బారావ్ గారు, ఎస్పీ ఉన్నారు. వారు నాతో మీరు తలపెట్టిన రేపటి బంద్ పిలుపును ఉపసంహరించుకోండి. నగరంలో ముఖ్యమంత్రి పర్యటన ఉంది అన్నారు. వారి ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. ఆసమయంలో అధికారులు ఇద్దరూ నాతో.. చనిపోయిన లక్ష్మిది ఈప్రాంతం కాదు, ఆస్తిపరూరాలు కాదు, కుల బలం లేదు. ఆలాంటి వ్యక్తి కోసం మీరు పోరాటం చేస్తే మీకు గానీ, మీపార్టీకిగానీ వచ్చే లాభం ఏమిటి అని అడగంతో పాటు పై నుంచి మీపై కేసులు పెట్టడం తప్ప అని వ్యాఖ్యానించారు. వారికి ఒకే సమాధానంగా… “మా ఉద్యమం వలన సామాజిక చైతన్యం కలిగి సామాన్య ప్రజలు కూడా ధైర్యంగా నివసించగలరు. అదే సమయంలో అధికారులు కూడా బాధ్యతగా ప్రవర్తించేందుకు ఈ ఉద్యమం అవసరం అనేసాను.. ఏమిటో ఈయన మార్క్సిజాన్ని తిరగేసి చదువుతున్నారు” అని కామెంట్ కూడా చేశారు. మరుసటిరోజు బంద్ విజయవంతంగా జరిగింది. పోలీసులు ముందుగానే అన్నట్టుగా మాపై కేసులు కూడా పడ్డాయి. చిత్తూరు సబ్ జైలులో వారం పాటు నిర్బందించారు. మా ఉద్యమ సందేశం ఆనాడు నగరంలో హాకర్స్ , రిక్షా తదితర అసంఘటిత కార్మిక సంఘాలు బలపడడానికి ఊతం ఇచ్చింది. జై భీమ్ సినిమా చుస్తుంటే 37 ఏళ్ల క్రితం పోలీసుల అకృత్యాలకు బలైన లక్ష్మి, నాటి పోరాటం సినిమాగా నా కళ్ల ముందు కదులుతున్నాయని అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే. నారాయణ.

Also Read: Priyanka Chopra: లాస్ ఏంజెల్స్‏లో భర్తతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న గ్లోబల్ స్టార్.. ప్రశంసిస్తున్న నెటిజన్స్..

Shyam Singha Roy: మాస్ లుక్‏లో అదరగొడుతున్న నాని.. శ్యామ్ సింగరాయ్ సాంగ్ రిలీజ్..

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి