- Telugu News Photo Gallery Cinema photos Priyanka chopra celebrates diwali and performs lakshmi pooja with her husband nik jonas
Priyanka Chopra: లాస్ ఏంజెల్స్‌లో భర్తతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న గ్లోబల్ స్టార్.. ప్రశంసిస్తున్న నెటిజన్స్..
లాస్ ఏంజెల్స్‌లోని తన నివాసంలో భర్తతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది ప్రియాంక.
Updated on: Nov 06, 2021 | 12:56 PM

ప్రియాంక చోప్రా.. ఏలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకుంది. బాలీవుడ్ స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్‌గా మారింది.

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. వరుస సూపర్ హిట్ చిత్రాలతో గ్లోబల్ స్టార్‌గా మారి అగ్రకథానాయికిగా కొనసాగుతుంది.

కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే హాలీవుడ్ నటుడు.. గాయకుడు నికో జోనాస్‌ను వివాహం చేసుకుని అమెరికాలో స్థిరపడిపోయింది. అయితే ప్రియాంక అమెరికాలో స్థిరపడిపోయిన భారతీయ సంప్రదాయలను ఏమాత్రం మర్చిపోలేదు.

తాజాగా లాస్ ఏంజెల్స్‌లోని తన నివాసంలో భర్తతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంది ప్రియాంక. భర్త కుటుంబసభ్యుల సమక్షంలో లక్ష్మీ పూజ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆ ఫోటోలలో నికో జోనాస్.. ప్రియాంక సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ పూజలో పాల్గోన్నారు. ప్రియాంక దంపతుల దీపావళీ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక ప్రియాంక, నికో జోనాస్ ఫోటోలపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా సాంప్రదాయలను మర్చిపోలేదని ప్రశంసిస్తున్నారు. ప్రియాంక లాంటి వారే భారత్‌కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.





























