Andhra Pradesh: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. కారును చెక్ చేయగా ఊహించని ట్విస్ట్..
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. రోడ్డు ప్రక్కన ఉన్న కల్వర్టు ను ఢీకొని ఓ కారు బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు..
Vizianagaram: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం షికారుగంజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. రోడ్డు ప్రక్కన ఉన్న కల్వర్టు ను ఢీకొని ఓ కారు బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. రోడ్డు ప్రమాదానికి కారణాలను విశ్లేషించే పనిలో భాగంగా కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడే పోలీసులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది.ఆ కారులో మొత్తం 12 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి.
కాగా మృతులు ఉత్తర ప్రదేశ్‌కి చెందిన గంజాయి స్మగర్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కాగా అసలు ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది..? ఎక్కడికి తరలిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు..? అన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాలు రవాణా, గంజాయి వినియోగంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్స్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్- విజయవాడ హైవే గంజాయి రవాణా కారిడార్‌గా మారింది. నిత్యం తనిఖీలు చేస్తున్నా స్మగర్లు కొత్త కొత్త పద్ధతుల్లో వీటిని రవాణా చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..