తలకు రుమాలు.. మెడలో టవల్.. మారువేషంలో నేరగాళ్లకు చెక్ పెడుతున్న పోలీసులు..! ఎక్కడో తెలుసా..!

తలకు రుమాలు, సాధారణ దుస్తుల్లో తిరగడం.. వ్యవసాయ పనుల కోసం వచ్చినట్లుగా చెప్పడం..  గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ తప్పుడు పనులు చేసేవారికి చుక్కలు చూపించడం..

తలకు రుమాలు.. మెడలో టవల్.. మారువేషంలో నేరగాళ్లకు చెక్ పెడుతున్న పోలీసులు..! ఎక్కడో తెలుసా..!
Madakashira Mandal Si Sesha
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 13, 2021 | 8:45 PM

తలకు రుమాలు, సాధారణ దుస్తుల్లో తిరగడం.. వ్యవసాయ పనుల కోసం వచ్చినట్లుగా చెప్పడం..  గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ తప్పుడు పనులు చేసేవారికి చుక్కలు చూపించడం.. ఇది నిత్యం ఈ పోలీస్ అధికారి డ్యూటీ. తనతోపాటుమరో ఇద్దరిని వెంటబెట్టుకుని గ్రామాల్లో తిరగడం అక్కడ జరుగుతున్న తెలుసుకోవడం వెంటనే వారిపై దాడులు చేయడం నిత్యం ఇదే పని.. దీంతో  అనంతపురం జిల్లాలోని ఆ గ్రామీణ మండలంలో పేకాటరాయుళ్ల పాలిట సింహస్వప్నంగా మారిపోయాడు. ఏ వేశంలో ఎస్సై దాడి చేస్తాడో తెలియకు వణికిపోతున్నారు. మడకశిర మండలంలో ఎక్కడైనా చాటుగా పేకాటరాయుళ్ళతో కలిసి పేకాట ఆడుతున్నారా అయితే చీమ చిటుక్కుమన్నా కూడా ఉలిక్కిపడాల్సిందే…ఎందుకంటే మడకశిర ఎస్సై శేషగిరి మారువేషాలు ధరించి పేకాటరాయుళ్ల భరతం పడుతున్నాడు.

పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందితే చాలు వాళ్ల కోసం పక్కా వ్యూహంతో వలపన్ని జూదర్లను పట్టుకొని వాళ్లు ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు తీసుకొని పేకాట రాయుళ్ల పాలిట సింహస్వప్నంగా నిలుస్తున్నాడు. ఎస్ఐ శేషగిరి మాటువేస్తే పేకాట రాయుళ్లు అయినా మట్కా బీటర్లు అయినా ఆయన వేసిన ప్లాన్‌కు చిక్కాల్సిందే. దొంగతనాలు దోపిడీలు హత్యలు జూదం కేంద్రంగానే జరుగుతాయని  బలంగా నమ్మే ఎస్సై శేషగిరి జూదాన్ని అరికట్టడమే తన టార్గెట్‌గా పెట్టుకున్నాడు.ఇందులో భాగంగానే జూదరుల భరతం పట్టి మట్కా,పేకాట రాయుళ్ల ఆటలు కట్టిస్తున్నారు.

తాజాగామడకశిర మండల పరిధిలోని గుర్రపు కొండ గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో మారువేషంలో అక్కడికి చేరుకొని పేకాట ఆడుతున్న వారందరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పేకాటరాయుళ్లకు ఎస్ఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. నిత్యం జూదమాడే చెడు అలవాట్లు ఉన్న వ్యక్తులు వెంటనే వాటిని మానుకొని కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకు౦టే సమాజంలో గౌరవం, మర్యాద ఉంటుందని జూదర్లకు క్లాస్ తీసుకున్నాడు.

మార్పు కనిపించకుంటే జూదర్లు ఎంతటివాళ్లైనా స్టేషన్ కు తీసుకువచ్చి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.పేకాట రాయుళ్ల అలవాట్లు మార్చుకుని కష్టపడి పనిచేసే విధా౦గా ఎస్సై శేషగిరి కౌన్సెలింగ్ ఇస్తున్నారని పలువురు గ్రామ పెద్దలు ఎస్సై ను అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు జాబితా రెడీ.. ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి నిధులు..

CJ NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు… మరో రోజు యాదాద్రి దర్శనంకు రానున్న చీఫ్ జస్టీస్

Monsoon update: రైతులకు ముఖ్య సూచన.. మరో మూడు రోజుల పాటు వర్షాలు..

CM KCR Review: అంద‌రి భాగ‌స్వామ్యంతోనే నూటికి నూరుశాతం అభివృద్ధి.. సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?