Corrupt Officers: లంచం ఇవ్వనిదే పని జరగదు.. ఏసీబీకి చిక్కిన అటవీ అధికారి.. ఎంత లంచం డిమాండ్ చేశాడంటే..
అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి వనపర్తి జిల్లాకు హరితహారానికి సంబంధించిన మొక్కలను తరలించాడు. అందుకు సంబంధించిన బిల్లులను చేయమని అటవీశాఖ అధికారి బాబ్జీ రావును అడగగా..

లంచాల మత్తులో మునిగి అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిన కొందరు అధికారులు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. అలాంటివారిపై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నా.. తమను కాదంటూ దోచుకునే పనిలో మునిగితేలుతున్నారు . తాజాగా అనంతపురం జిల్లాలో ఓ అటవీ అధికారి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. అతడు అడిగింది అడవిని అక్రమ మార్గంలో కొట్టుకునేందుకు కాదు.. హరిత హారం మొక్కలను తరలించేందుకు. అనంతపురం జిల్లా అటవీశాఖ అధికారి బాబ్జీ రావు 4 లక్షల రూపాయలను లంచంగా డిమాండ్ చేశాడు.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు బాబ్జీ రావును పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి…. ఏపీలోని అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి వనపర్తి జిల్లాకు హరితహారానికి సంబంధించిన మొక్కలను తరలించాడు. అందుకు సంబంధించిన బిల్లులను చేయమని అటవీశాఖ అధికారి బాబ్జీ రావును అడగగా రూ. 4 లక్షల 25 వేల లంచాన్ని డిమాండ్ చేశాడు.
దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ సూచనల మేరకు మూడు లక్షల రూపాయలను ఈ రోజు సాయంత్రం బాబ్జీరావుకు అందిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.