Ambani Bomb Scare : అంబానీ బాంబు కేసులో అనేక మలుపులు.. పేరుని తిరిగి తెచ్చుకోవడానికే ఈ పనిచేశానంటున్న సచిన్ వాజే

ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అంబానీ ఇంటి ముందు పేలుళ్ల పదార్ధాల కేసు దర్యాప్తులో ప్రతి రోజూ కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. అనేక మలుపులు తీసుకుంటూ దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే...

Ambani Bomb Scare : అంబానీ బాంబు కేసులో అనేక మలుపులు.. పేరుని తిరిగి తెచ్చుకోవడానికే ఈ పనిచేశానంటున్న సచిన్ వాజే
Ambani Bomb Scare
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2021 | 3:37 PM

Ambani Bomb Scare : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అంబానీ ఇంటి ముందు పేలుళ్ల పదార్ధాల కేసు దర్యాప్తులో ప్రతి రోజూ కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. అనేక మలుపులు తీసుకుంటూ దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే అనుమానుతుడిగా ఉన్న ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సీఐయు) మాజీ హెడ్ సచిన్ వాజే బ్లాక్ మెర్సిడెజ్ కారును తాజాగా పోలీసులు సీజ్ చేశారు. తాజాగా సచిన్ వాజ్ ఉపయోగించిన మెర్సిడెస్‌ కారులో నోట్ కౌంటింగ్ మెషీన్ దొరికిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి యంత్రాన్ని ERV బ్యాంక్, షాప్ లేదా వ్యాపారులు డబ్బును లెక్కించడానికి ఉపయోగిస్తారు. అయితే, సచిన్ వేజ్ తన కారులో కౌంటింగ్ మెషిన్ ను ఎందుకు ఉంచాడు అనే విషయం పై ఎన్నో ప్రశ్నలు తెలెత్తుతున్నాయి.

అంతేకాదు మెర్సిడెస్ కారులో సుమారు రూ. 5, 75,000 నగదు లభించినట్లు కొన్ని వర్గాల నుంచి టాక్ వినిపిస్తోంది. వాహనంలో నిజమైన స్కార్పియో నంబర్ ప్లేట్ తోపాటు మరికొన్ని నకిలీ నంబర్ ప్లేట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు కారులో కిరోసిన్ బాటిల్ కూడా ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. సచిన్ వాజ్ .. టోపీ మరియు ఫేస్ మాస్క్ ను కిరోసిన్ పోసి తగలబెట్టినట్లు తెలుస్తోంది. అయితే, వారు పిపిఇ కిట్‌ను కాల్చడం మర్చిపోయారు. టోపీ ని తగలబెట్టిన ప్రాంతానికి ఎన్ఐఏ బృందం దర్యాప్తు చేయడానికి వెళ్లనున్నట్లు సమాచారం

ఇక మరోవైపు సీఐయు విభాగంలో డ్రైవర్లుగా పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నించే అవకాశం ఉంది. అంబానీ ఇంటి వెలుపల పేలుడు పదార్థాలను ఉంచడానికి అనేక వాహనాలు మరియు నంబర్ ప్లేట్లు ఉపయోగించబడ్డాయి. పేలుడు పదార్థాలను నిల్వ చేయడానికి రెండు వాహనాలను ఉపయోగించారు. సచిన్ వాజ్ స్వయంగా రెండు మెర్సిడెస్ కార్లను ఉపయోగిస్తున్నట్లు ఎన్ఐఏ బృందం గుర్తించారు. దీంతో ఇప్పుడు సిఐయు విభాగంలో డ్రైవర్లుగా పనిచేస్తున్న పోలీసు సిబ్బందిని ఎన్‌ఐఏ విచారించబోతోంది. సచిన్ వాజే జెలటిన్‌ను ఎక్కడ, ఏ వాహనంలో తీసుకువచ్చాడనే దానిపై ఎన్‌ఐఏ బృందం దర్యాప్తుని వేగవంతం చేసింది.

ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(సీఐయు) మాజీ హెడ్ సచిన్ వాజే బ్లాక్ ఈ పని ఎందుకు చేశాడనే కోణంలో విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తన పేరుని మళ్ళీ తిరిగి సొంతం చేసుకోవడానికి జా యూనస్ కేసులో తన ప్రతిభను నిరూపించుకోవడానికి ముఖేష్ అంబానీ ఇంటికి ముందు పేలుడు పదార్ధాలు పెట్టినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది. విచారణ సమయంలో, సచిన్ వాజ్ ఎన్ఐఏకు చాలా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: రోడ్డుపైకి దూసుకొచ్చిన జింకల గుంపు.. కార్లపై నుంచి లాంగ్ జంప్.. వీడియో నెట్టింట్లో వైరల్

నోటికి ఏమి తినాలనిపించడం లేదా.. అప్పుడు ఈ చింతపండు పచ్చడి ట్రై చేస్తే సరి

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..