Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chintapandu Pachadi : నోటికి ఏమి తినాలనిపించడం లేదా.. అప్పుడు ఈ చింతపండు పచ్చడి ట్రై చేస్తే సరి

చింతపండు గుజ్జు తో పులిహోరా చేస్తారు.. అంతేకాదు చింతపండును కూరల్లోకి, కొన్ని రకాల పచ్చళ్ళలోకి కూడా ఉపయోగిస్తారు.. అయితే చింతపండునే రోటి పచ్చడిగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి పుల్లపుల్లగా తియ్యగా ఉండి..

Chintapandu Pachadi : నోటికి ఏమి తినాలనిపించడం లేదా.. అప్పుడు ఈ చింతపండు పచ్చడి ట్రై చేస్తే సరి
Chintapandu Pacchadi
Follow us
Surya Kala

|

Updated on: Mar 17, 2021 | 2:34 PM

Chintapandu Pachadi :  చింతపండు గుజ్జు తో పులిహోరా చేస్తారు.. అంతేకాదు చింతపండును కూరల్లోకి, కొన్ని రకాల పచ్చళ్ళలోకి కూడా ఉపయోగిస్తారు.. అయితే చింతపండునే రోటి పచ్చడిగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి పుల్లపుల్లగా తియ్యగా ఉండి రుచికరంగా ఉంది.. ఈరోజు చింతపండు పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..!

చింతపండు పచ్చడి తయారీకి కావలసిన పదార్ధాలు :

చింతపండు – 50 గ్రాములు ఎండు మిరపకాయలు – 20 బెల్లం – 25 గ్రాములు (ఆప్ షనల్) ఉప్పు – రుచికి సరిపడా నూనె – ఆవాలు – స్పూను పసుపు – పావు స్పూను మెంతులు – పావుస్పూను

పచ్చడి పోపుకి కావాల్సినవి

కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి నూనె

తయారీ విధానం : ముందుగా చింతపండులో గింజలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో కొంచెం తక్కువ నీరు తీసుకుని అందులో శుభ్రం చేసుకున్న చింతపండుని వేసుకుని నానబెట్టుకోవాలి.

తర్వాత స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేసి.. అది వేడి ఎక్కిన తర్వాత ఎండుమిర్చి , మెంతులు , ఆవాలు , కొంచెం ఇంగువ వేసి పోపు వేయించుకోవాలి . తర్వాత బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి పోపు చల్లారిన తర్వాత మిక్సీ లో గానీ లేందంటే రోట్లో గానీ ఈ పోపు అంతా వేసుకుని .. తగినంత ఉప్పు పసుపు వేసుకుని మెత్తగా దంచుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన చింతపండు, బెల్లం ను వేసుకుని మెత్తగా దంచుకోవాలి. (నీళ్ళు తక్కువ వేస్తె పచ్చడి గట్టిగా ఉండి అన్నంలో కలుపు కోవడానికి వీలుగా ఉంటుంది. అసలు తీపి ఇష్టంలేని వారు..షుగర్ పేషేంట్స్ బెల్లం వేయకుండా చేసుకోవచ్చు )

ఈ పచ్చడి ఫ్రిజ్ లో పెట్టకపోయినా వారం రోజులు నిల్వ ఉంటుంది . ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , గారెలు , వడలు , రోటీలు , చపాతీలు అన్నం లోకి బాగుంటుంది .

Also read : బిజీ రోడ్డు మీద కదులుతున్న కారులోంచి జారిపడ్డ చిన్నారి. వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

కొమ్ము, పంజాలతో భయంకర ఆకారం.. దడపుట్టించే సంఘటన.. ఇంతకీ అది దెయ్యమేనా.!