AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toddler Falls From Car : బిజీ రోడ్డు మీద కదులుతున్న కారులోంచి జారిపడ్డ చిన్నారి. వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు

సాధారణంగా మనం చిన్నపిల్లలతో కలిసి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రయాణం చేస్తున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కారులో చిన్నపిల్లలతో కలిసి ప్రయాణిస్తుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి...

Toddler Falls From Car : బిజీ రోడ్డు మీద కదులుతున్న కారులోంచి జారిపడ్డ చిన్నారి.  వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
Toddler Falls From Car
Surya Kala
|

Updated on: Mar 17, 2021 | 2:26 PM

Share

Toddler Falls From Car : సాధారణంగా మనం చిన్నపిల్లలతో కలిసి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రయాణం చేస్తున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కారులో చిన్నపిల్లలతో కలిసి ప్రయాణిస్తుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. కారు తలుపులు అన్ని లాక్ చేసి ఉన్నాయా లేదో అనేది రెండుమూడు సార్లు చెక్‌ చేసుకోవాలి. లేకపోతే.. చిన్నారులు రిస్క్‌లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చిన్నపాటి ఏమరపాటు కారణంగా ప్రమాదంలో పడ్డ ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వాహనాల రాకపోకలతో చాలా రష్‌గా ఉన్న నాలుగు రోడ్ల కూడలి వద్ద గ్రీన్‌సిగ్నల్ పడటంతో వాహనాలన్నీ ముందుకు కదిలాయి. అన్నికంటే ముందు వరుసలో ఉన్న ఓ కారు కొంచం వేగంగా ముందుకు కదిలింది. ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ.. కారు వెనుక డోర్‌ ఒక్కసారిగా ఓపెన్‌ అయిపోయింది.

దీంతో..వెనుక సీట్లో ఉన్న చిన్నారి కారులోంచి జారి రోడ్డుపై పడిపోయాడు. అదృష్టవశాత్తూ అప్పుడే వాహనాలన్నీ కదలడం ప్రారంభించడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. దీంతో..వెనుకున్న వాహనదారులు వెంటనే అప్రమత్తమై..ఎక్కడివారు అక్కడే తమ వాహనాలను నిలిపివేశారు. అయితే..బిడ్డ జారిపోయిన విషయం గమనించిన తల్లి వెంటనే పరిగెత్తుకుంటూ వెనక్కు వచ్చి బిడ్డను తీసుకెళ్లింది. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవడంతో వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్‌ అవుతున్నారు. అలాగే వారి అదృష్టం బాగుంది..లేదంటే ఎంతటి ప్రమాదం సంభవించేదో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read: తెలంగాణలో ప్రారంభమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

: తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని తాను కలలు కన్న అంతరిక్షంలోకి అడుగు పెట్టిన కల్పన..నేటి యువతకి ఆదర్శం