AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalpana Chawla : తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని తాను కలలు కన్న అంతరిక్షంలోకి అడుగు పెట్టిన కల్పన..నేటి యువతకి ఆదర్శం

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కల్పనా చావ్లా. చిన్నతనం నుంచి తండ్రిని ఆదర్శంగా తీసుకుని కలలు కన్నారు. ఆ కలలను నిజం చేసుకుని తాను అనుకున్న రంగంలో అడుగు పెట్టి సక్సెస్ అందుకుని...

Kalpana Chawla : తండ్రినే స్ఫూర్తిగా తీసుకుని తాను కలలు కన్న అంతరిక్షంలోకి అడుగు పెట్టిన కల్పన..నేటి యువతకి ఆదర్శం
Kalpana Chawla Father
Surya Kala
|

Updated on: Mar 17, 2021 | 1:28 PM

Share

Astronaut Kalpana Chawla : ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కల్పనా చావ్లా. చిన్నతనం నుంచి తండ్రిని ఆదర్శంగా తీసుకుని కలలు కన్నారు. ఆ కలలను నిజం చేసుకుని తాను అనుకున్న రంగంలో అడుగు పెట్టి సక్సెస్ అందుకుని చరిత్రలో తనకంటూ ఓ పేజీని సృష్టించుకున్నారు . .. జీవితంలో ఎంత కష్టపడి పైకి ఎదిగారో … ఆ ఆనందాన్ని సంతోషాన్ని ఎక్కువ కాలం అనుభవించకుండా విధి వక్రించి చిన్న వయసులోనే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు.. ఆమె ఎవరో కాదు కల్పనా చావ్లా. తాను మరణించినా చరిత్రలో ధ్రువతారలా వెలుగుతూనే ఉన్నారు.. ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఈరోజుకి నిలుస్తున్న కల్పన జయంతి నేడు..

హర్యానా రాష్ట్రంలోని కర్నాల్ పట్టణంలో 1962 మార్చి 17 న బనారసీలాల్ చావ్లా దంపతులకు కల్పనా చావ్లా జన్మించారు. తల్లిదండ్రులకు చివరి సంతానం కల్పనా.. ఆమె చదువు మీద పెట్టిన శ్రద్ధను చూసిన తల్లిదండ్రులు అప్పటి రూల్స్ ప్రకారం పాఠశాలలో చేర్చే సమయంలో అధికార జన్మదినం జూలై 1 1961కి మార్చారు. సునీత, దీప, సంజయ్ ల తర్వాత కల్పన జన్మించారు.

ఇంట్లో చివరి పిల్లకావడంతో ముద్దు ఎక్కువ.. ఇక “మోంటు” అంటూ ముద్దుగా పిలుచుకునేవారు. ఇక కల్పనా చావ్లా తండ్రి బనారసీలాల్ చావ్లా సాధారణ వ్యాపారి. అయితే ఆయన జీవితంలో ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం.. ఆ ప్రభావం కల్పనపై కూడా పడింది.

కల్పనా పుట్టక ముందు బనారసీలాల్ పేదవారే అయితే ఆయన పట్టుదల , కృష్టి తో ఆర్ధికంగా ఉన్నత స్థానానికిఇ ఎదిగారు.. పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు.

చిన్నగా టైర్ల వ్యాపారాన్ని ప్రారంభించిన బనారసీలాల్ చావ్లా మొదట ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని మార్చుకోలేదు.. పట్టుదలతో వ్యాపారాన్ని సాగించారు. అయితే అప్పటిలో టైర్ల తయారీకి విదేశీ యంత్రాన్ని ఉపయోగించేవారు.  దీంతో మనదేశంలోనే సొంతంగా టైర్ల తయారీ కి యంత్రం ఎందుకు ఉండకూడదు అని ఆలోచించారు.. దానికి రూపకల్పన చేసి ఆయన దేశీయంగానే టైర్ల తయారీ యంత్రాన్ని రూపొందించారు. బనారసీలాల్ శ్రమ ఫలించింది. రాష్ట్రపతి నుంచీ అభినందనలు అందుకున్నారు. అప్పటి నుంచి మళ్ళీ కల్పనా కుటుంబం డబ్బుకోసం ఇబ్బంది పడింది లేదు. తండ్రి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్న కల్పన కు జీవితంలో ఏదైనా సాధించాలని అనే కోరిక మొదలైంది. అన్నతో పాటు ఎక్కువగా విమానం బొమ్మలను చూసిన కల్పనా బాల్యం నుంచి వ్యోమగామి కావాలని కలలు కున్నారు. తన కలను నెరవేర్చుకునేందుకు చండీగఢ్ లోని పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1982లో నాసాలో చేరాలన్న లక్ష్యంతో అమెరికా వెళ్లారు. అక్కడ ఆమె టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో ఏం.టెచ్ మరియు తరువాత కొలరాడో విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాపుచ్చుకున్నారు. అనంతరం కల్పనా చావ్లా 1988లో నాసాలో చేరారు.

పరిస్థితులు ఎలాగున్నా… కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం అన్న మాటలు నా తండ్రి జీవితంలో నిజమయ్యాయి. ఫలితంగా అవే నాలోనూ జీర్ణించుకుకుపోయాయి. అందుకు నాన్నే కారణం.” అంటూ తొలి అంతరిక్షయానం తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆలోచనలు ఏ విధంగా ప్రభావితమయిందీ కల్పన వివరించారు. మొదటి అంతరిక్ష మిషన్ ను 1997 నవంబరు 19న ప్రారంభమైంది. ఆ తర్వాత తన టీమ్ తో కలిసి ఈ యాత్రకు వెళ్లిన కల్పనా 5 డిసెంబర్ 1997 వరకు అంతరిక్షంలోనే ఉన్నారు. ఈ యాత్రంలో కల్పన 1.04 మిలియన్ మైళ్లు ప్రయాణించారు. మొదటి మిషన్ సమయంలో 372 గంటలు అంతరిక్షంలో గడిపారు. దీంతో అంతరిక్షానికి చేరుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.

వ్యోమగామి కావాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి సప్త సముద్రాలు దాటిన కల్పన చావ్లా రెండోసారి అంతరిక్షంలో అడుగు పెట్టారు. దీంతో కల్పనా పేరు భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది., అమ్మాయిల కలలకు రెక్కలు ఇస్తే.. ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధిస్తారు అంటూ ప్రశంసల వర్షం కురిసింది. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కల్పనా ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకుని చిన్న వయసులోనే మరణించారు.

ఇక బాలీవుడ్ లో ఎన్నో బయోపిక్ లు తెరకెక్కుతున్న నేపథ్యంలో ఆసియా తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా బయోపిక్ తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కల్పనా పాత్రలో నటించడానికి పలు హీరోయిన్లు ఆసక్తిని చూపిస్తున్నారు కూడా నేటితరం మహిళలకు కల్పనా చావ్లా ఓ ఆదర్శం.

Also read: భాగ్యనగర వాసులు బహుపరాక్.. మీకు ఉచిత వాటర్ కావాలంటే ఆధార్ లింక్ చేయాల్సిందే..

 అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ప్రత్యేక ఆఫర్లతో కిడ్స్‌ కార్నివాల్‌ సేల్‌ ప్రారంభం