Amazon Kids Carnival: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. ప్రత్యేక ఆఫర్లతో కిడ్స్‌ కార్నివాల్‌ సేల్‌ ప్రారంభం

Amazon Kids Carnival: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. మన దేశంలని ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో మొదటిస్థానం సంపాదించుంది. కేవలం ..

  • Subhash Goud
  • Publish Date - 12:51 pm, Wed, 17 March 21
1/4
Amazon Kids Carnival 1
Amazon Kids Carnival: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. మన దేశంలని ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో మొదటిస్థానం సంపాదించుంది. కేవలం పండగలు, ప్రత్యేకమైన రోజుల్లోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంది అమెజాన్‌.
2/4
Amazon Kids Carnival 2
తాజాగా అమెజాన్‌ కిడ్స్‌ కార్నివాల్‌ను నిర్వహిస్తోంది. వరుస ఆఫర్లు, డిస్కౌంట్‌తో స్పెషల్‌ కార్నివల్‌ సేల్స్‌ కొనసాగిస్తోంది. ఇటీవల సమ్మర్‌ అప్లియన్సెస్‌ కార్నివల్‌ సేల్‌ను ప్రారంభించిన అమెజాన్‌, ఇప్పుడు పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్‌ కార్నివల్‌ పేరుతో ఈ సేల్‌ను ప్రారంభించింది. మార్చి 16న ప్రారంభమైన ఈ ఈసేల్‌ మార్చి 21 వరకు కొనసాగుతుంది.
3/4
Amazon Kids Carnival 3
ఈ సేల్‌లో భాగంగా పిల్లలు ఎంతగానో ఇష్టపడే వస్తువులతో పాటు వారికి అవసరమైన వస్తువులన్నింటినీ అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా పుస్తకాలు, బోర్డు గేమ్స్‌, స్కూల్‌ బ్యాగ్స్‌, పిల్లలకు ఉపయోగపడే వివిధ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్‌లను అందిస్తోంది. అయితే ఇవే కాకుండా ఆన్‌లైన్‌ క్లాసులకు ఉపయోగపడే ఎకో స్మార్ట్‌ స్పీకర్‌, ఫైర్‌ టీవీ పరికరాలు, కిండ్లే , ఈ-రీడర్స్‌ తదితర వస్తువులపై 30 శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది.
4/4
Amazon Kids Carnival 4
ఈ సెల్‌లో భాగంగా ఆమెజాన్‌ ఇండియా ఫోర్త్‌ జనరేషన్‌ ఎకో డాట్‌ స్మార్ట్‌ స్పీకర్‌ను కేవలం రూ.3,999 ధరకే అందిస్తోంది. అలాగే అలెక్సా వాయిస్‌ రిమోట్‌ లైట్‌తో పని చేసే ఫైర్‌టీవీ స్టిక్‌ లైట్‌ను రూ .2,999 ధరకు అందిస్తోంది. పిల్లలకు ఎంతో ఇష్టమైన వీడియో గేమ్స్‌పైన ప్రత్యేక డిస్కౌంట్‌ అందిస్తోంది. కిడ్స్ కార్నివాల్‌ సేల్‌ల్‌లో భాగంగా టెన్త్‌ జనరేషన్‌ కిండ్లే ఈ-రీడర్‌ను కేవలం రూ .7,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇవే కాకుండా పిల్లలకు అవసరమైన స్కూల్‌ బుక్స్‌, పెన్నులు, పెన్సిళ్లు, బాక్సులు తదితర వస్తువులపై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది.