AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా పాజిటివ్‌..ఆశ్రమానికి సీలు.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ కంగ్రా జిల్లా జోన్‌ గ్యూటో బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా సోకింది. ఫిబ్రవరి...

Coronavirus: బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా పాజిటివ్‌..ఆశ్రమానికి సీలు.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ
Himachal Dharamshala
Follow us
Subhash Goud

|

Updated on: Mar 17, 2021 | 1:31 PM

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. హిమాచల్‌ ప్రదేశ్‌ కంగ్రా జిల్లా జోన్‌ గ్యూటో బౌద్ధ ఆశ్రమంలో 150 మంది సాధువులకు కరోనా సోకింది. ఫిబ్రవరి 18వ తేదీన టిబెటన్‌ కొత్త సంవత్సరం సందర్భంగా బౌద్ధ ఆశ్రమంలో వేడుకలు జరిగాయి. అయితే ఈ ఆశ్రమంలో 20 మందికి కోవిడ్‌ సోకడంతో అప్రమత్తమన వైద్య అధికారులు 330 మంది సాధువులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 150 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. 8 రోజుల్లోనే 154 మందికి కరోనా సోకడంతో గ్యూటో ఆశ్రమాన్ని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు అధికారులు. ఈ ఆశ్రమానికి కర్ణాటక, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 23న 15 మంది బౌద్ద భిక్షుకులు వచ్చారు. అయితే ఇలా ఒక్కొక్కరిగా ఇప్పటి వరకు 150 మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు గుర్తించారు.

సాధువుల్లో ఎలాంటి లక్షణాలు లేవు

కాగా, కరోనా సోకిన సాధువుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, ప్రయాణాలు చేసి వచ్చినవారిని ఆశ్రమంలోనే క్వారంటైన్‌ చేశామని కంగ్రా జిల్లా కలెక్టర్‌ రాకేష్‌ ప్రజాపతి తెలిపారు. మరో విషయం ఏంటంటే బయట ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులకు కరోనా నెగిటివ్‌ అని నిర్ధారణ అయింది. కానీ అందులో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను తాండ మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించామని కలెక్టర్‌ తెలిపారు. బౌద్ద ఆశ్రమానికి సీలు వేశామని సబ్‌ డివిజన్‌ మెజిస్ట్రేట్‌ వెల్లడించారు. బౌద్ధ ఆశ్రమంలో 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు వేశామని అధికారులు చెప్పారు. కాగా, ఇలా దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులు నుంచి పాజిటివ్‌ కేసుల సంఖ్య పూర్తిగా తగ్గిపోగా, ఇటీవల నుంచి మళ్లీ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా పూర్తి స్థాయిలో కట్టడిలోకి వస్తుందనుకునే లోపు దేశంలో మళ్లీ కేసులు పెరుగుతుండటంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా కట్టడికి చర్యలు చేపడుతోంది. దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలున్నాయి. అధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తున్నారు. మహారాష్ట్రలో అయితే చాలా ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మాస్క్‌ ఉండేలా చర్యలు చేపడుతున్నారు. మాస్క్‌ ధరించనివారికి పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే మరింత ప్రమాదంలో పడే అవకాశాలున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి :

Corona Cases: మరోసారి భయపెడతున్న కరోనా తీవ్ర రూపం.. మళ్లీ 200కు చేరువలో కోవిడ్ మరణాలు..

Corona Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా ఎన్ని పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయంటే.!