రాళ్లమధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న తాబేలు, ఆదుకున్న మనసున్న మనిషి, వీడియో వైరల్

ఆపదలో  ఆదుకునే ఆపన్నులు  ఎవరైనా నిజంగా కరుణామయులే.. మనిషైనా, జంతువైనా ఇలా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మనుషులైతే  రక్షించాల్సిందిగా కేకలు పెడతారు. కానీ మూగ జీవాల విషయంలో అలా కాదు...

రాళ్లమధ్య చిక్కుకుని విలవిలలాడుతున్న తాబేలు, ఆదుకున్న మనసున్న మనిషి, వీడియో వైరల్
Man Rescues Turtle Struck Beneath Rocks In Viral Video
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 17, 2021 | 2:27 PM

ఆపదలో  ఆదుకునే ఆపన్నులు  ఎవరైనా నిజంగా కరుణామయులే.. మనిషైనా, జంతువైనా ఇలా ప్రాణాపాయంలో ఉన్నప్పుడు మనుషులైతే  రక్షించాల్సిందిగా కేకలు పెడతారు. కానీ మూగ జీవాల విషయంలో అలా కాదు. నోరు లేని అవి మూగగానే అల్లాడుతుంటాయి. ఇప్పుడు మనం వినబోయేది, చూడబోయేది కూడా ఇలాంటిదే.. సముద్రం నుంచి భూమిపైకి వచ్చి .. మధ్య బండరాళ్లలో చిక్కుకుని పోయింది ఓ తాబేలు.. కాస్త భారీ శరీరం కావడంతో ఆ రాళ్ల మధ్య నుంచి బయటికి రాలేక నానా అవస్థలూ పడుతూ వచ్చింది. అలా ఒకటి కాదు, రెండు కాదు కొన్ని గంటల పాటు అది ఆ రాళ్లమధ్యే చిక్కుకుని విలవిలలాడింది. చివరకు ఎవరో వ్యక్తి వచ్చి దాని అవస్థలు చూశాడు. మెల్లగా  దాన్ని ఆ బండ  రాళ్ల మధ్య నుంచి పైకి లేపి భూమ్మీదికి వదిలాడు. అంతే ! ఆ కూర్మం వడివడిగా తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోయింది.  ఆపదలో చిక్కుకున్న ఒకరు  ఆ తరువాత కేర్ చేయకుండా వెళ్ళిపోయినా.. ఆ వ్యక్తి లేదా ఆ జంతువు పట్ల చూపే దయాగుణమే ప్రధానమైనది అంటూ అటవీ అధికారి సుశాంత నందా ఈ వీడియోను షేర్ చేసుకున్నారు.

నువ్వు సరైన పనే చేశావని ఇతరులు గుర్తించకున్నా..  దాని గురించి పట్టించుకోకుండా జాలి, దయాగుణం చూపినప్పుడే మనం హీరోలమవుతాం అని ఆయన చివరలో ఓ సందేశం ఇఛ్చారు.  మనం ఓ సాయం చేశామని చెప్పుకోవడం కాదు.. మన సాయం వల్ల ఒక ప్రాణి.. ఆపద నుంచి ప్రాణాలతో బయట పడిందన్నది ముఖ్యం అని నందా క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియోను చూసినవారు, ఈ సందేశాన్ని చదివినవారు రకరకాలుగా స్పందించారు. జీవితంలో ఒకరికి సాయం చేసే అవకాశాలు చాలా తక్కువగా వస్తాయని, ఫలితం కోసం చూడకుండా అలా ఒక్కోసారి ప్రాణాలకు కూడా తెగించి రక్షించడమన్నది నిజంగా గొప్ప విషయం అవుతుందని పలువురు ట్వీట్ చేశారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :అగ్నిపర్వతాన్ని ఆపుతున్న విగ్నేశ్వరుడు వీడియో..ఏడాదిలో ప్రతిరోజు వినాయక చవితి : Vighveshwar stops the volcano video. నడిరోడ్డు పై జలకాలాట.. ఇంతలో ఊహించని సంఘటన.. నవ్వులు పూయిస్తున్న వీడియో : Viral Video.

రామ్ మరియు సుకుమార్ కాంబోలో వచ్చిన జగడం మూవీ పై ఆసక్తి విషయాలు తెలిపిన డైరెక్టర్ : Sukumar-Ram video