AIMIM official Twitter: మజ్లిస్ పార్టీ ట్విట్టర్ ఖాతా హ్యాక్.. డీపీగా ఏం పెట్టారంటే..?
సైబర్ నేరగాళ్లు మజ్లిస్ పార్టీపై గురిపెట్టారు. మజ్లిస్ పార్టీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు టార్గెట్ చేయడం సంచలనం రేపింది. హ్యాకర్లు మజ్లిస్ పార్టీ...
సైబర్ నేరగాళ్లు మజ్లిస్ పార్టీపై గురిపెట్టారు. మజ్లిస్ పార్టీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్లు టార్గెట్ చేయడం సంచలనం రేపింది. హ్యాకర్లు మజ్లిస్ పార్టీ పేరును ఎలన్ మాస్క్ పార్టీగా మార్చేశారు. అంతేకాదు ట్విట్టర్ డీపీలో ఎలన్ మాస్క్ ఫోటో కూడా పెట్టారు. ఎలన్ మాస్క్ ప్రపంచ కుబేరుడు. స్పేస్ ఎక్స్ లాంటి కంపెనీకి అధిపతి. ఆయన ఫోటోను మజ్లిస్ ట్విట్టర్ ఖాతా డీపీగా పెట్టడం సంచలనం రేపింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ ఏఐఎంఐఎం పార్టీ పోటీ చేయనుంది. ఇటీవల ఈ విషయాన్ని ఓవైసీ అనౌన్స్ చేశారు. ఇందుకోసం ఆయన యూపీలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ సహకారంతో పార్ట్‌నర్‌షిప్ సంకల్ప్ మోర్చాను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఆయన పార్టీ ట్విటర్ ఖాతా హ్యాక్‌కు గురికావడం సంచలనం రేపింది. దీనిపై మజ్లిస్ పార్టీ వర్గాలు ట్విటర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి. కాగా బిహార్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం ఐదు స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవల కాలంలో హ్యాకర్స్ రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీలతో సమాజంలో పేరున్న వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలను టార్గెట్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలు సృష్టించి.. డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలపై కంప్లైంటులు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ సైబర్ కేటుగాళ్ల బాధితుల లిస్ట్‌లో పోలీసులు కూడా ఉండటం కొసమెరుపు.
Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఆ ఆరుగురిపైనే సీబీఐ ఫోకస్