YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఆ ఆరుగురిపైనే సీబీఐ ఫోకస్

42 రోజుల నుంచి కేవలం ఆ ఆరుగురు అనుమానితులు చుట్టే వివేకా కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. గతంలో ఢిల్లీ కేంద్రంగా కూడా కొనసాగించిన విచారణలో....

YS Viveka murder case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక అప్‌డేట్.. ఆ ఆరుగురిపైనే సీబీఐ ఫోకస్
Cbi Speeds Up Investigation On Ys Vivekananda Reddy Case
Follow us

|

Updated on: Jul 18, 2021 | 6:05 PM

42 రోజుల నుంచి కేవలం ఆ ఆరుగురు అనుమానితులు చుట్టే వివేకా కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. గతంలో ఢిల్లీ కేంద్రంగా కూడా కొనసాగించిన విచారణలో సైతం ఈ ఆరుగురు అనుమానితులను విచారించి స్టేట్మెంట్ ని రికార్డు చేసుకున్న నేపథ్యంలో అసలు ఈ ఆరుగురు అనుమానితులు ఎవరు? వీళ్ళనే పదే పదే విచారించడానికి గల కారణాలు ఏంటో ఓసారి చూద్దాం..

వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ కొనసాగిస్తున్న విచారణ రెండు అడుగులు ముందుకు…మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉంది. ఇప్పటికి మూడు పర్యాయాలు కడపలో పలువురు అనుమానితులను విచారించి స్టేట్మెంట్ లను రికార్డ్ చేసుకొని వెళ్లిపోయారు. అనంతరం ఈ సంవత్సరం జూన్ లో మళ్ళీ నాలుగో విడతగా సీబీఐ గత 42 రోజుల నుంచి కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కేంద్రం గా విచారణ కొనసాగిస్తున్నారు. కడపలోనే కాక పులివెందులలో సైతం విచారిస్తూ కీలక సమాచారాన్ని రికార్డ్ చేసుకుంటున్నారు..అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణ లోనూ, ఇప్పుడు జరుపుతున్న విచారణ లో పదే పదే ఆ ఆరుగురు అనుమానితులను మాత్రమే విచారిస్తూ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఈ ఆరుగులు అనుమానితులు ఎవరు అనే విషయాన్ని వస్తే…వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, వివేకా పీఏ కృష్ణ రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్ మెన్ రంగన్న, ఇనాయతుల్లా తో పాటు ఉమామహేశ్వరరెడ్డి.

ఈ అనుమానితులందరూ కూడా వివేకానందరెడ్డి హత్య జరిగిన తరవాత ఆధారాలు చెరిపి వేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, వివేకానందరెడ్డితో సన్నిహితంగా మెలిగిన వారు, ఆయన ఇంట్లో పనిచేసిన వారు. వీరిని మాత్రమే  పదే పదే సీబీఐ విచారిస్తూ ఉండడం గమనార్హం. ఇక అనుమానితుల్లో ఎర్ర గంగి రెడ్డి వివేకాకి ప్రధాన అనుచరుడు కావడం తో పాటు వై ఎస్ వివేకానందని చివరి సారిగా ఆయన ఇంటి వద్ద దిగబెట్టి వెళ్లిన వ్యక్తి కావడంతో అతడిపై ఫోకస్ ఎక్కువగా ఉంది. ఎర్రగంగి రెడ్డి సాక్ష్యాధారాలు చెరిపేసారని ఆరోపణలు ఉండడంతో జైలుకి కూడా వెళ్లివచ్చాడు. అదే తరహాలో వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్నను సీబీఐ అధికారులు పదే, పదే ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు వివేకా ఇంటి వద్ద రంగన్న కాపలా ఉన్నారు. గతంలో సిట్‌ అధికారులు కూడా ఆయన్ను విచారించి గుజరాత్‌లో నార్కో పరీక్షలు నిర్వహించారు. మరో అనుమానితుడు మాజీ డ్రైవర్‌ దస్తగిరి. .ఇతను వివేకా దగ్గర పనిచేసేవాడు. హత్య కావడానికి 6 నెలల ముందు పని మానేయడంతో అతడిని పలు కోణాల్లో సీబీఐ విచారిస్తోంది. ఇక పీఏ కృష్ణా రెడ్డి వివేకానంద దగ్గర మొదటి నుంచి పనిచేయడంతో పాటు ఆయనకు ఎక్కువ సన్నిహితంగా ఉండేవారు. దీంతో అతడిపై కూడా ఫోకస్ గట్టిగానే ఉంది. ఇక పులివెందుల కి చెందిన కృష్ణయ్య కుటుంబం వివేకా దగ్గర సన్నిహితంగా మెలిగిన విషయం తెలిసిందే.  వివేకా పొలాలకు సంబంధించిన వ్యవహారాలు చక్కబెట్టే ఉమా మహేశ్వరర్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాపై నిఘా పెట్టారు అధికారులు. వీళ్లతో పాటు జిల్లాలోని కొత్త కొత్త వ్యక్తులు, మహిళల పేర్లు కూడా తెర మీదకు వస్తూ ఉండడంతో ఈ కేసు విషయంలో సీబీఐ ఎంత లోతుగా దర్యాప్తు జరుపుతుందో అర్థమవుతుంది. సో, ఏది ఏమైనప్పటికి గతంలో కంటే వివేకా హత్య కేసు విషయంలో దూకుడు పెంచిన విషయం అర్థమవుతుంది.

(సేరి సురేష్, టీవీ9 తెలుగు, కడప జిల్లా)

Also Read: ఈమె లేడీ కాదు…కిలాడీ.. నాలుగు పెళ్లిళ్లు.. ఎన్నో మోసాలు

వాగులో వెలసిన గంగమ్మ ! నట్టనడి ప్రవాహంలో అద్భుత దృశ్యం

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..