AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor: మదనపల్లిలో దారుణం.. గోడౌన్‌లో యువకుడి నిర్బంధం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Chittoor: చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కార్తీక్ అనే దళిత యువకుడిని నాలుగు రోజులుగా నిర్బంధించారు.

Chittoor: మదనపల్లిలో దారుణం.. గోడౌన్‌లో యువకుడి నిర్బంధం.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Arrest
Shiva Prajapati
|

Updated on: Jul 18, 2021 | 7:53 PM

Share

Chittoor: చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కార్తీక్ అనే దళిత యువకుడిని నాలుగు రోజులుగా నిర్బంధించారు. వివరాల్లోకెళితే.. మదనపల్లిలో ఉన్న సప్తగిరి షోరూమ్‌లో కర్తీక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అయితే, ఇటీవల కార్తిక్.. షోరూమ్ యాజమాన్యానికి తెలియకుండా బొలెరో వాహనాన్ని బయటకు తీసుకెళ్లాడు. అలా తీసుకెళ్లిన బొలెరో రోడ్డు ప్రమాదానికి గురవడంతో స్వల్పంగా దెబ్బ తిన్నది. ఈ విషయం తెలుసుకున్న షోరూమ్ మేనేజర్.. కార్తిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనుమతి లేకుండా వాహనాన్ని తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశాడనే కారణంగా.. కార్తిక్‌ను షోరూమ్‌కు చెందిన ఓ గదిలో నిర్బంధించారు. దాదాపు నాలుగు రోజులగా షోరూమ్‌లోనే కార్తిక్‌ని నిర్బంధించాడు మేనేజర్. అయితే విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘాల నేతలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులతో కలిసి షోరూమ్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. కార్తిక్‌ను నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ ఏజెన్సీలో రెచ్చిపోయిన దొంగలు.. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీలో దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని పాడేరులో ఉన్న బజాజ్ షో రూమ్‌లో చోరీకి విఫల యత్నం చేశారు. షో రూమ్ లోకి చొరబడ్డ దొంగలు క్యాష్ కౌంటర్‌ను ఎత్తుకెళ్లారు. క్యాష్ కౌంటర్ ను సమీపంలోని పొదల్లోకి తీసుకువెళ్లి ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆ లాకర్ ఎంతకూ ఓపెన్ అవ్వలేదు. దాంతో క్యాష్ కౌంటర్‌ను తీసుకువెళ్తే దొరికిపోతామని భయపడిన దొంగలు.. ఆ క్యాష్ కౌంటర్‌ను తుప్పల్లోనే విడిపెట్టి పారిపోయారు. తుప్పల్లో పడిఉన్న క్యాష్ కౌంటర్‌ను గుర్తించిన స్థానికులు.. షోరూమ్ సిబ్బందికి సమాచారం అందించారు. షోరూమ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Mahabubabad: ఎలుకల పాలైన రెండున్నర లక్షల రూపాయలు.. బాధితుడికి అండగా నిలిచిన మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్..

Telangana Corona: తెలంగాణకు ఉపశమనం.. భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు..

Telangana-Andhra: ఇక్కడేమో నాటు పడవల్లో.. అక్కడేమో బైక్ పెట్రోల్ ట్యాంక్‌లో.. వాటే క్రియేటివీటీ..

ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
ఏపీలోని రైతులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కొత్త పథకం
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
చావు దగ్గరపడుతుందని ముందే గ్రహించే జీవి ..శాస్త్రవేత్తలకే షాక్!
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్.. రంగంలోకి మరో జట్టు?
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
పదే పదే కడుపు నొప్పి వస్తున్నా లైట్ తీసుకుంటున్నారా.. ప్రమాదకరమే
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
ఏడు జన్మలలో ఒకే వ్యక్తి భర్తగా ఉండగలరా..? ఎలా సాధ్యమో తెలుసుకోండి
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
మందుబాబులకు పూనకాలే.. దేశంలోనే బెస్ట్ బార్ల లిస్ట్ వచ్చేసింది
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
శుక్రుడి ఎఫెక్ట్ :అదృష్టం కలిసి వచ్చే రాశులివే.. మరి మీ రాశి ఉందా
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
ఆధార్ కార్డు ఉన్నవారికి అదిరిపోయే న్యూస్..కేంద్రం నుంచి రూ.90వేలు
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
టీవీ9 నెట్‌వర్క్ ఆధ్వర్యంలో ఆటో 9 అవార్డులు..
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?
మతిమరుపు వేధిస్తోందా? ఫోకస్ కుదరట్లేదా?