Crime Video: సినీనటి సంగీత బిజ్లానీ ఫామ్‌హౌస్‌లో దొంగతనం… ఫామ్‌హౌస్‌ను ధ్వంసం చేసిన దొంగలు
మహారాష్ట్ర పుణే జిల్లాలోని మావల్‌లో ఉన్న సినీ నటి సంగీత బిజ్లానీ ఫామ్‌హౌస్‌లో దొంగతనం జరిగింది. దొంగలు మొత్తం ఫామ్‌హౌస్‌ను ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చాలా నెలల తర్వాత నటి తన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నప్పుడు ఈ సంఘటన...

మహారాష్ట్ర పుణే జిల్లాలోని మావల్‌లో ఉన్న సినీ నటి సంగీత బిజ్లానీ ఫామ్‌హౌస్‌లో దొంగతనం జరిగింది. దొంగలు మొత్తం ఫామ్‌హౌస్‌ను ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చాలా నెలల తర్వాత నటి తన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నప్పుడు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పూణే రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, నటి సంగీత బిజ్లానీ మాట్లాడుతూ, ‘ఫామ్‌హౌస్ ప్రధాన ద్వారం మరియు కిటికీ గ్రిల్ విరిగిపోయాయి. ఒక టీవీ సెట్ కనిపించడం లేదు, సీసీటీవీ కెమెరాలతో పాటు మంచం మరియు రిఫ్రిజిరేటర్ సహా అనేక గృహోపకరణాలు ధ్వంసం చేశారు అని చెప్పుకొచ్చింది.
తన తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా ఫామ్‌హౌస్‌కు వెళ్లలేకపోయానని ఫిర్యాదులో సంగీత పేర్కొంది. ఈ రోజు తన ఇద్దరు మనిమనుషులను వెంటబెట్టుకుని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు సంగీత బిజ్లాని. అయితే అక్కడికి చేరుకున్న వెంటనే ప్రధాన ద్వారం విరిగిపోయి ఉండటం చూసి షాక్ అయ్యానని చెప్పింది. తాము లోపలికి వెళ్ళినప్పుడు కిటికీ గ్రిల్ విరిగిపోయింది. ఒక టీవీ సెట్ కనిపించడం లేదు, మరొకటి విరిగిపోయి ఉంది అని పోలీసులుకు వివరించింది.
అంతేకాకుండా దొంగలు పై అంతస్తులో చాలా విధ్వంసం చేశారని సంగీత బిజ్లాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెడ్‌రూముల్లో మంచాలన్నీ విరిగిపోయాయని, అనేక గృహోపకరణాలు మరియు విలువైన వస్తువులు దొంగిలించారని తెలిపారు. దొంగలు దోచుకోవడమే కాకుండా ఆ స్థలాన్ని కూడా ధ్వంసం చేసినట్లు వీడియోలో చూడవచ్చు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.




