AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త..! భరించలేక మరో మహిళ ఆత్మహత్య! అసలు కథ ఏంటంటే..?

వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నాయి.. కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించడంతోపాటు.. ప్రాణాలు తీస్తున్నాయి. లేదా.. ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి.. తాజాగా ఓ అక్రమ సంబంధం ప్రాణం తీసుకునేలా చేసింది.. ఇద్దరికి పెళ్లి అయినప్పటికీ.. వివాహేతర సంబంధాన్ని గుట్టుగా నడిపారు.. ఈ క్రమంలోనే.. తనను బాయ్‌ఫ్రెండ్ పట్టించుకోవడం లేదని.. వివాహిత ఆత్మహత్య చేసుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.

Andhra: భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త..! భరించలేక మరో మహిళ ఆత్మహత్య! అసలు కథ ఏంటంటే..?
Andhra Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jul 19, 2025 | 9:26 AM

Share

వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నాయి.. కుటుంబాల్లో అల్లకల్లోలం సృష్టించడంతోపాటు.. ప్రాణాలు తీస్తున్నాయి. లేదా.. ప్రాణాలు తీసుకునేలా చేస్తున్నాయి.. తాజాగా ఓ అక్రమ సంబంధం ప్రాణం తీసుకునేలా చేసింది.. ఇద్దరికి పెళ్లి అయినప్పటికీ.. వివాహేతర సంబంధాన్ని గుట్టుగా నడిపారు.. ఈ క్రమంలోనే.. తనను బాయ్‌ఫ్రెండ్ పట్టించుకోవడం లేదని.. వివాహిత ఆత్మహత్య చేసుకోవడం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లాలోని కుప్పంలో గురువారం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. కుప్పం అర్బన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుప్పం మండలానికి చెందిన ఓ వివాహిత (25)కు సత్యవేలు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అయితే.. దాన్ని కొంతకాలం గుట్టుగా కొనసాగించారు. ఈ క్రమంలోనే.. సత్యవేలు ఆమెను పట్టించుకోవడం లేదని వివాహిత ఆవేదన చెందింది.

ఈ క్రమంలో.. ఈ మధ్య నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ.. ఆ మహిళ.. అని సత్యవేలుకు తన ఫోన్ లోని వాట్సప్‌ ద్వారా సందేశం పంపింది. దీనికి సత్యవేలు కూడా రిప్లే ఇచ్చాడు.. ఎప్పుడూ నీతోనే ఉండాలా..? నేను నా భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాలి.. అంటూ సమాధానం ఇచ్చాడు.. ‘‘అయితే.. నీకు.. నా కన్నా.. నీ భార్యే ముఖ్యమా…? నేను చనిపోతున్నా’’ అంటూ మహిళ రిప్లే ఇచ్చింది.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ చాటింగ్ కు సంబంధించిన వివరాలను మృతురాలి ఫోన్ లో గుర్తించామని.. మహిళ మృతికి కారకుడైన సత్యవేలుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. వివాహిత మృతికి కారణమైన సత్యవేలుపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.. కుప్పం పోలీసుస్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కాగా.. శుక్రవారం కుప్పం ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అనంతరం ఆమె అంత్యక్రియలు పూర్తయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..