సెక్స్‌ రాకెట్‌: నటుడు అరెస్ట్‌.. ముగ్గురు బుల్లితెర నటులను కాపాడిన పోలీసులు

ముంబయిలోని ఫైవ్‌-స్టార్ హోటల్‌లో ఓ నటుడు నడుపుతున్న సెక్స్ రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ రాకెట్ నడుపుతున్న ఓ సినీ నటుడుని అరెస్ట్ చేశారు

  • Tv9 Telugu
  • Publish Date - 1:29 pm, Sun, 25 October 20
సెక్స్‌ రాకెట్‌: నటుడు అరెస్ట్‌.. ముగ్గురు బుల్లితెర నటులను కాపాడిన పోలీసులు

Mumbai Sex Racket: ముంబయిలోని ఫైవ్‌-స్టార్ హోటల్‌లో ఓ నటుడు నడుపుతున్న సెక్స్ రాకెట్‌ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఆ రాకెట్ నడుపుతున్న ఓ సినీ నటుడుని అరెస్ట్ చేశారు. ఇందులో చిక్కుకున్న ముగ్గురు బుల్లితెర నటులను వారు రక్షించారు. అందులో ఓ బెల్లీ డ్యాన్సర్‌ కూడా ఉన్నారు.

కాగా కొంతమంది మహిళలు ఓ సెక్స్ రాకెట్‌లో చిక్కుకుపోయినట్లు ఇటీవల ముంబయి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈ సెక్స్ రాకెట్‌ గుట్టు బయట పెట్టేందుకు పోలీసులు ఓ ప్రణాళిక రచించారు. నిందితులను పట్టుకునేందుకు ఓ నకిలీ కస్టమర్‌ని పంపించారు. అతడికి ముగ్గురు మహిళలను ఇచ్చేందుకు రూ.10.5లక్షలకు ఆ నటుడు డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తరువాత సీనియర్ పోలీస్ అధికారి మహేష్ థావడే నేతృత్వంలోని ఓ బృందం.. ఓ ఫైవ్ స్టార్ హోటల్‌పై దాడి చేసి సినీ నటుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆ నటుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Read More:

దాదాపు వంద కోట్లతో రెండు అపార్ట్‌మెంట్లు కొన్న హృతిక్‌..!

నటుడిగా రాఘవేంద్రరావు.. జోడీ కట్టబోతున్న ఆ ముగ్గురు హీరోయిన్లు..!