Double Murder: అబ్దుల్లాపూర్‌మెట్‌లో డబుల్ మర్డర్ కేసులో సంచలనం.. హంతకుడు జ్యోతి భర్త శ్రీనివాసే..
హైదరాబాద్ నగర శివారులో జంట హత్యలు. సంచలనం రేపిన డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది.పతి,పత్నీ ఔర్ ఓ.., క్రైమ్ కథా చిత్రానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ వేశారు రాచకొండ పోలీసులు. దర్యాప్తులో నిజం తేలింది. యశ్వంత్- జ్యోతి ..

హైదరాబాద్ నగర శివారులో జంట హత్యలు(Double Murder). సంచలనం రేపిన డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది.పతి,పత్నీ ఔర్ ఓ.., క్రైమ్ కథా చిత్రానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ వేశారు రాచకొండ పోలీసులు. దర్యాప్తులో నిజం తేలింది. యశ్వంత్- జ్యోతి .. డబుల్ మర్డర్స్‌కు కారణం వివాహేతర సంబంధమేనని దర్యాప్తులో తేల్చారు రాచకొండ పోలీసులు. అంతేకాదు నిందితుల్ని కూడా గుర్తించారు. జ్యోతి భర్త శ్రీనివాస్ అతని స్నేహితులే హత్య చేశారని తేలింది. హత్య చేసిన తరువాత శ్రీనివాస్, అతని ఫ్రెండ్స్ విజయవాడకు వెళ్లారు. రాకెట్ స్పీడ్‌తో దర్యాప్తును దౌడ్ తీయించిన రాచకొండ పోలీసులు టీమ్స్ నిందితుల్ని అరెస్ట్ చేశారు. విచారణలో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. వెంటపడలేదు. వెంబడించి వేటాడారు. సీన్ టు సీన్‌ను జరిగిన ఘటనలు తెలిస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.
హత్య ఎలా జరిగిందంటే..
జ్యోతిని విజయవాడకు ఫిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేశాడు భర్త శ్రీనివాస్ రావు. అయితే చివరి సారిగా కలుద్దాం అంటూ జ్యోతి యశ్వంత్ ఫోన్‌లో చర్చించుకున్నారు. చివరిసారి కలిసేందుకు ఓ నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకున్నారు. వారు అనుకున్న ప్రదేశానికి భర్త శ్రీనివస్ రావు కూడా వచ్చాడు. నిర్జీవ ప్రాంతంలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ ఇద్దరిని చూసిన భర్త శ్రీనివాస్ రావు కోపంతో రెచ్చిపోయిన దాడి చేసి చంపేశాడు. ముందుగా భార్య జ్యోతిని తలపై బండ రాయితో కొట్టి చంపిన శ్రీనివాస్ రావు. పారిపోతున్న యశ్వంత్‌ని అక్కడే ఉన్న ఆయుధాలతో దాడి చేసి చంపేశాడు.
హత్యకు కారణం.. వివాహేతర సంబంధం..
హత్యలు చేసిన తీరు అతి జుగుప్సకరం. పెనిమిటి పగ రివీలైంది. అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో యశ్వంత్-జ్యోతిల దారుణ హత్యల కేసు దర్యాప్తులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధమే కారణమనేది ప్రాథమిక దర్యాప్తు సారాంశం. కానీ యశ్వంత్-జ్యోతిలను హత్య చేసిన తీరు చూస్తే నిందితులు ఎంత కసిడాట్‌గాళ్లో సీన్ కళ్లకు కడుతోంది. ఇదిగో ఇక్కడే ..జంట హత్యలు జరిగింది ఈ నిర్మానుష్య ప్రాంతంలోనే. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జ్ సమీపంలో ఆ ఇద్దరు ఏకంతంగా ఉన్న సమయంలో నిందితులు అటాక్ చేశారు. అత్యంత పైశాచికంగా ఇద్దర్నీ కడతేర్చారు. ఆ దారిలో వెళ్తున్న స్థానికులు డెడ్‌బాడీని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో జంట హత్యల ఉదంతం తెరపైకి వచ్చింది.
అసలేం జరిగింది..
ఆమెకు 28. అతనికి 22 ఏళ్లు. ఇద్దరిదీ సికింద్రాబాద్‌లోని వారసిగూడ ఏరియా. జ్యోతికి పెళ్లయింది. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. యశ్వంత్ కారు డ్రైవర్. ఒకే ఏరియాలో ఉండడంతో యశ్వంత్-జ్యోతికి మధ్య పరిచయం ఏర్పడింది. ఫోన్ పే చర్చ. కుదిరితే షాపింగ్, ఔటింగ్. స్నేహంగా వుండడంతో తప్పు లేదు. కానీ ఫ్రెండ్‌షిప వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీళ్లద్దరి క్లోజ్‌నెస్ జ్యోతి భర్త కంటపడ్డం..మందలించడం కూడా జరిగింది. సెట్‌రైట్ అయివుంటే పరిస్థితి ఇందాక వచ్చి వుండేది కాదు. ఎవరిక్కూడా ఈ విషయాలు తెలియదు. ఎప్పట్లానే తన సోదరుడి టూ వీలర్ తీసుకొని బయటకు వెళ్లాడు యశ్వంత్. రెండు రోజులైనా టచ్‌లోకి రాలేదు. కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. ఏం జరిగి వుంటుందని ఆందోళన చెందుతున్న టైమ్‌లోనే యశ్వంత్ బ్రదర్‌కు పోలీసుల నుంచి ఫోన్ కాల్.
క్రైమ్ వార్తల కోసం..
ఇవి కూడా చదవండి: PK Mission: కొత్త పార్టీ పెట్టడం లేదు.. పాదయాత్ర చేస్తాను.. ఆయన పాలనపై పీకే కీలక వ్యాఖ్యలు..
ఉత్కంఠ పోరులో వైసీపీకే దుగ్గిరాల ఎంపీపీ పీఠం.. వ్యూహాత్మకంగా గెలిచిన రూపవాణి..



